Telugu Global
National

కాలుష్య మరణాల్లో భారత్ ది మొదటి స్థానం

భారత్ లో కాలుష్యం కారణంగా 2019 లో 23 లక్షల 50 వేల మంది మరణించినట్టు ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ ప్రకటించింది. ఈ విధంగా కాలుష్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మరణించగా అందులో అత్యధిక మరణాలు మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ 2019 నివేదిక ప్రకారం కాలుష్యం కారణంగా భారత్ లో మరణించిన 23 లక్షల 50 వేల మందిలో 16.7 […]

కాలుష్య మరణాల్లో భారత్ ది మొదటి స్థానం
X

భారత్ లో కాలుష్యం కారణంగా 2019 లో 23 లక్షల 50 వేల మంది మరణించినట్టు ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ ప్రకటించింది. ఈ విధంగా కాలుష్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మరణించగా అందులో అత్యధిక మరణాలు మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ది లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ 2019 నివేదిక ప్రకారం కాలుష్యం కారణంగా భారత్ లో మరణించిన 23 లక్షల 50 వేల మందిలో 16.7 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయి . 9.8 లక్షల మంది పరిసర PM2.5 కాలుష్యం, 6.1 లక్షల మంది గృహ వాయు కాలుష్యం కారణంగా మరణించారని అధ్యయనం తెలిపింది. నీటి కాలుష్యం వల్ల 5 లక్షల మంది మరణించారు, అయితే 1.6 లక్షల మంది వృత్తిపరమైన కాలుష్యం కారణంగా మరణించగా 2.3 లక్షల మంది సీసం బహిర్గతం అయిన‌ కారణంగా మరణించారు.ఒక్క 2019లోనే అకాల మరణాల వలన కలిగిన నష్టం రూ. 3.5 కోట్ల కోట్లు.

అనాలోచిత పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పర్యవసానంగా పెరుగుతున్న‌ ఈ ఆధునిక కాలుష్యం వల్ల సంవత్సరానికి సంవత్సరం మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2019 లో మరణాలు 2015తో పోల్చుకుంటే 7% 2వేల సంవత్సరంతో పోల్చుకుంటే 66% పెరిగాయి.

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, పర్యావరణ నిబద్ధత కలిగిన కొన్ని సమూహాలు, వ్యక్తులు, అతి కొన్ని దేశాల‌ ప్రభుత్వాలు చేస్తున్న ప్ర‌యత్నాలు పెద్దగా ఫలితాలను సాధించలేకపోతున్నాయి. ముఖ్యంగా భారత దేశం లాంటి తక్కువ ఆదాయ, మధ్య ఆదాయ దేశాలలో ఈ కాలుష్యం ఎక్కువగా ఉంది. తీవ్రమైన. వాయు కాలుష్యం, సీసం వల్ల కలిగే కాలుష్యం, ప్రమాదకర రసాయన కాలుష్యాన్ని నియంత్రించడానికి, కాలుష్య సంబంధిత వ్యాధులను నివారించడానికి తక్షణ శ్రద్ధ అవసరం.

ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉంది, పైగా భారత్‌కు కాలుష్య నియంత్రణకు ఒక బలమైన కేంద్రీకృత యంత్రాంగ వ్యవస్థ లేదు అని అధ్యయనంలో లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్ వెల్లడించింది.

ఈ కాలుష్య మరణాలలో ప్రపంచంలోనే 23 లక్షల 50 వేల మరణాలతో భారత్ మొదటి స్థానంలో ఉండగా 22లక్షల మరణాలటొ చైనా రెండవ స్థానంలో ఉంది.

First Published:  19 May 2022 2:04 AM GMT
Next Story