Telugu Global
Cinema & Entertainment

ఆ విమర్శపై క్లారిటీ ఇచ్చిన పరశురామ్

సర్కారు వారి పాట సినిమాలో స్క్రిప్ట్ పరంగా చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం కామన్ గా అందరూ అంగీకరించిన తప్పు. అదేంటంటే.. సినిమాలో మహేష్ బాబు, కీర్తిసురేష్ కు 10వేల డాలర్లు అప్పు ఇస్తాడు. ఆ తర్వాత మరో 15వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ సినిమా అంతా 10వేల డాలర్లు తిరిగి ఇచ్చేయమని మాత్రమే అడుగుతాడు. రెండో దఫా ఇచ్చిన 15వేల డాలర్ల గురించి ఇంకెక్కడా ప్రస్తావించలేదు. దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. […]

parasuram
X

సర్కారు వారి పాట సినిమాలో స్క్రిప్ట్ పరంగా చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం కామన్ గా అందరూ అంగీకరించిన తప్పు. అదేంటంటే.. సినిమాలో మహేష్ బాబు, కీర్తిసురేష్ కు 10వేల డాలర్లు అప్పు ఇస్తాడు. ఆ తర్వాత మరో 15వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ సినిమా అంతా 10వేల డాలర్లు తిరిగి ఇచ్చేయమని మాత్రమే అడుగుతాడు. రెండో దఫా ఇచ్చిన 15వేల డాలర్ల గురించి ఇంకెక్కడా ప్రస్తావించలేదు.

దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. స్క్రిప్ట్ లో ఆమాత్రం చూసుకోకపోతే ఎలా అంటూ కామెంట్స్ పడ్డాయి. ఎట్టకేలకు ఈ విమర్శపై దర్శకుడు పరశురామ్ స్పందించాడు. తనదైన శైలిలో దాన్ని సమర్థించుకున్నాడు.

“ఈ సినిమాలో హీరో మహేష్ పాత్ర హీరోయిన్ కి పాతిక వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు కేవలం పదివేల డాలర్లే అడుగుతాడు. ఎందుకంటే. హీరో, హీరోయిన్ కి ఇచ్చిన అప్పు పదివేల డాలర్లే. మిగతా పదిహేను వేల డాలర్లను హీరో, హీరోయిన్ పై ప్రేమతో ఇస్తాడు. అది అప్పు కాదు. అందుకే ఆ 15వేల డాలర్లను ఎక్కడా ప్రస్తావించడు.”

ఇక హీరోయిన్ పై కాళ్లు వేసుకొని హీరో పడుకునే సీన్ ను కూడా పరశురామ్ సమర్థించుకున్నాడు. అందులో ఎలాంటి అశ్లీలం లేదని, అది అశ్లీలంగా భావించినట్టయితే అందరికంటే ముందు మహేష్ ఆ సీన్ చేయడని, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని పద్ధతిగానే తీశానని చెప్పుకొచ్చాడు. పరశురామ్ ఎంత సమర్థించుకున్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆ ఎపిసోడ్ నచ్చలేదనేది వాస్తవం. ఆ సన్నివేశాలప్పుడు కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారనేది నిజం.

First Published:  18 May 2022 10:44 AM GMT
Next Story