Telugu Global
NEWS

నావిక దళంతో గొడవ లేదు, ఆంక్షలు మాత్రమే ఉన్నాయి

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. విద్యుత్ కోతలు తాత్కాలికమని.. వాటిని చూపిస్తూ అసలు ఏపీలో కరెంట్ ఉండదు అన్నట్టుగా ప్రచారం చేసి పరిశ్రమలు రాకుండా చేయాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇలాంటి ప్రచారం మానుకోవాలన్నారు. చంద్రబాబు గతంలో దావోసు వెళ్లింది బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసమేనన్నారు. తాను మంత్రిగా వచ్చి ఇంకా నెల కూడా కాలేదని.. అప్పుడే ఎన్ని పెట్టుబడులు […]

గుడివాడ అమర్‌నాథ్
X

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. విద్యుత్ కోతలు తాత్కాలికమని.. వాటిని చూపిస్తూ అసలు ఏపీలో కరెంట్ ఉండదు అన్నట్టుగా ప్రచారం చేసి పరిశ్రమలు రాకుండా చేయాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇలాంటి ప్రచారం మానుకోవాలన్నారు. చంద్రబాబు గతంలో దావోసు వెళ్లింది బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసమేనన్నారు.

తాను మంత్రిగా వచ్చి ఇంకా నెల కూడా కాలేదని.. అప్పుడే ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించడం.. పెళ్లయిన నెల రోజులకే పిల్లలు ఎక్కడ అని అడిగినట్టుగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో 35 వేల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా… తాము అధికారంలోకి వచ్చాక మరో 21వేల మంది ఐటీ ఉద్యోగులు కొత్తగా ఏపీలో పనిచేస్తున్నారని అమర్ నాథ్ వివరించారు.

ఏపీలో ఐటీ వాతావరణం దెబ్బతినడానికి చంద్రబాబే కారణమన్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనేక మంది ముందుకొస్తే.. అందుకు అంగీకరించకుండా అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని.. కనీసం సౌకర్యాలు లేని అమరావతిలో కంపెనీలు స్థాపించడం ఇష్టం లేక వారు బయటకు వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేయాలన్నది తమ ఉద్దేశమన్నారు.

విశాఖలో నావిక దళం వల్లనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నామని తాము అన్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. విశాఖలో పర్యటన రంగాన్ని అభివృద్ది చేసే విషయంలో తూర్పు నావిక దళం నుంచి కొన్ని ఆంక్షలు ఉన్నాయని మాత్రమే తాను చెప్పానని… వారు సహకరించడం లేదని, వారితో గొడవ ఉందని ఎక్కడా తాను చెప్పలేదన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని నావిక దళం ఏర్పాటు చేసిన ఆంక్షలను తప్పు పట్టలేమన్నారు. విశాఖ బీచ్‌ వెంబడి పబ్‌లు ఏర్పాటు చేస్తే ఎవరైనా పర్యాటకుల ముసుగులో గన్నులు తీసుకుని బోట్లలో వస్తే పరిస్థితి ఏంటి అని గుడివాడ అమర్‌ నాథ్ ప్రశ్నించారు. విశాఖ తరహాలో నావిక దళ కేంద్రం లేదు కాబట్టే గోవా ఆస్థాయిలో పర్యాటకంగా అభివృద్ది చెందగలిగిందన్నారు మంత్రి.

First Published:  18 May 2022 3:02 AM GMT
Next Story