Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వాయిదా పడిన సత్యదేవ్ సినిమా

లెక్కప్రకారం సత్యదేవ్ సినిమా 20వ తేదీన విడుదలవ్వాలి. కానీ ఈ హీరో నటించిన గాడ్సే సినిమా మరోసారి వాయిదా పడింది. ఇంకో కొత్త డేట్ ప్రకటించారు మేకర్స్. “సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందే” అనే స్టేట్ మెంట్ తో ఈ సినిమా కొత్త […]

సత్యదేవ్
X

లెక్కప్రకారం సత్యదేవ్ సినిమా 20వ తేదీన విడుదలవ్వాలి. కానీ ఈ హీరో నటించిన గాడ్సే సినిమా మరోసారి వాయిదా పడింది. ఇంకో కొత్త డేట్ ప్రకటించారు మేకర్స్. “సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందే” అనే స్టేట్ మెంట్ తో ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ఇది. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.
ఇక టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపీగ‌ణేష్ అందిస్తున్నారు.

అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

First Published:  18 May 2022 10:52 AM GMT
Next Story