Telugu Global
National

జ్ఞాన్‌వాపి మసీదు కేసులో 'మీడియా లీక్స్' సర్వే కమిషన్ హెడ్‌ని తొలగించిన కోర్టు

జ్ఞానవాపి మసీదు సముదాయం వీడియోగ్రఫీ సర్వేకు నేతృత్వం వహిస్తున్న కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను వారణాసి కోర్టు మంగళవారం తొలగించగా, మిగిలిన ఇద్దరు కమిషనర్‌లకు సర్వేపై నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజుల గడువు ఇచ్చింది. మిశ్రా మీడియాకు సాక్ష్యాలను లీక్ చేస్తున్నారని, అతనికి సహకరిస్తున్న ప్రైవేట్ వీడియో గ్రాఫర్ క్రమం తప్పకుండా సర్వే విషయాలను బయటపెడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మరో ఇద్దరు కమిషనర్లు విశాల్ సింగ్, అభయ్ ప్రతాప్ ప్రత్యేక అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్లుగా కొనసాగుతారని […]

జ్ఞాన్‌వాపి మసీదు
X

జ్ఞానవాపి మసీదు సముదాయం వీడియోగ్రఫీ సర్వేకు నేతృత్వం వహిస్తున్న కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను వారణాసి కోర్టు మంగళవారం తొలగించగా, మిగిలిన ఇద్దరు కమిషనర్‌లకు సర్వేపై నివేదిక సమర్పించడానికి మరో రెండు రోజుల గడువు ఇచ్చింది.

మిశ్రా మీడియాకు సాక్ష్యాలను లీక్ చేస్తున్నారని, అతనికి సహకరిస్తున్న ప్రైవేట్ వీడియో గ్రాఫర్ క్రమం తప్పకుండా సర్వే విషయాలను బయటపెడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

మరో ఇద్దరు కమిషనర్లు విశాల్ సింగ్, అభయ్ ప్రతాప్ ప్రత్యేక అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్లుగా కొనసాగుతారని కోర్టు తెలిపింది.

కోర్టు నియమించిన కమిషన్, సోమవారం తన మూడు రోజుల సర్వేను ముగించింది, నివేదికను సమర్పించడానికి రెండు రోజుల సమయం కోరింది.

“మే 14,16 మధ్య‌ మూడు రోజుల పాటు సర్వే కొనసాగింది. 50 శాతం నివేదిక మాత్రమే సిద్ధంగా ఉంది, ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ రోజు కోర్టు ముందు పూర్తి నివేదికను ఉంచలేము. మేము కోర్టు నుండి 3-4 రోజుల సమయం కోరుతాము, ”అని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్, అజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు.

జ్ఞానవాపి మసీదు వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉంది. మసీదు కాంప్లెక్స్ వెలుపలి గోడపై ఉన్న మా శృంగార్ గౌరీ స్థల్ వద్ద రోజువారీ ప్రార్థనలకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళల బృందం వేసిన పిటిషన్‌ను స్థానిక కోర్టు విచారిస్తోంది.

మసీదు సముదాయంలోని వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని ఆ ప్రదేశానికి సీలు వేయాలని ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని వారణాసి కోర్టు వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మను ఆదేశించింది,

కాగా తనను తొలగించిన‌ అంశంపై మిశ్రా మాట్లాడుతూ నేను ఎలాంటి సర్వే వివరాలను బహిర్గతం చేయలేదు. అడ్వకేట్ విశాల్ సింగ్ ఆరోపణల కారణంగా నన్ను తొలగించారు. కోర్టు ఆదేశాలను నేను గౌరవిస్తాను. ఇదంతా అది విశాల్‌ వల్ల మాత్రమే జరిగింది.’ అని మిశ్రా అన్నారు.

First Published:  18 May 2022 1:52 AM GMT
Next Story