Telugu Global
NEWS

భారత క్రికెట్లో ఒకేఒక్కడు! 250 వికెట్ల క్లబ్ లో బుమ్రా

భారత్ కమ్ ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో 250 వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక భారత ఫాస్ట్ బౌలర్ గా బూమ్ బూమ్ బుమ్రా నిలిచాడు. టాటా ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన పోరులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను అవుట్ […]

250 వికెట్ల క్లబ్ లో బుమ్రా
X

భారత్ కమ్ ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో 250 వికెట్లు పడగొట్టిన తొలి, ఏకైక భారత ఫాస్ట్ బౌలర్ గా బూమ్ బూమ్ బుమ్రా నిలిచాడు.

టాటా ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన పోరులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను అవుట్ చేయడం ద్వారా టీ-20 క్రికెట్లో బుమ్రా 250వ వికెట్ ను సొంతం చేసుకోగలిగాడు.

తొలి ఫాస్ట్ బౌలర్ బుమ్రా..

తన కెరియర్ లో 206వ టీ-20 మ్యాచ్ కోసం బరిలోకి దిగిన బుమ్రా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టగలిగాడు. గతంలో ఇదే ఘనత సాధించిన భారత బౌలర్లలో అందరూ స్పిన్నర్లే కావడం విశేషం.

ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 274, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 271, మరో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు పియూష్ చావ్లా 270, అమిత్ మిశ్రా 262ల తర్వాతి స్థానంలో బుమ్రా నిలిచాడు.
200కు పైగా వికెట్లు పడగొట్టిన మొత్తం ఐదుగురు భారత బౌలర్లలో ముగ్గురు లెగ్ స్పిన్నర్లే కావడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

పేసర్లు ముగ్గురే ముగ్గురు!

టీ-20 క్రికెట్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన భారత పేస్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ( 223 వికెట్లు ), జయదేవ్ ఉనద్కత్ ( 201 ) మాత్రమే ఉన్నారు.

ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన బుమ్రా మొత్తం 142 వికెట్లు పడగొట్టాడు. మరో 8 వికెట్లు సాధిస్తే.150 వికెట్ల మైలురాయిని చేరుకోగలుగుతాడు.
ప్రస్తుత సీజన్ 13వ రౌండ్ వరకూ మొత్తం 119 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన బుమ్రా 142 వికెట్లు సాధించాడు.

2022 సీజన్లో 13 రౌండ్ల మ్యాచ్ లు ఆడిన బుమ్రా 12 వికెట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకొన్నాడు.
12 కోట్ల రూపాయల వేలం ధరకు బుమ్రా…ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.

First Published:  18 May 2022 12:41 AM GMT
Next Story