Telugu Global
Cinema & Entertainment

సర్కారు వారి పాట 5 రోజుల వసూళ్లు

మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా 5 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల్లో మరో రికార్డ్ సృష్టించింది సర్కారు వారి పాట సినిమా. 100 కోట్ల షేర్ లోకి ఎంటరైంది. ఈ 5 రోజుల్లో సాధించిన మరో ఘనత ఏంటంటే.. నైజాంలో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. కేవలం నైజాం మాత్రమే కాకుండా.. గుంటూరు, కృష్ణాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. ఈ వీకెండ్ […]

సర్కారు వారి పాట 5 రోజుల వసూళ్లు
X

మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా 5 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల్లో మరో రికార్డ్ సృష్టించింది సర్కారు వారి పాట సినిమా. 100 కోట్ల షేర్ లోకి ఎంటరైంది. ఈ 5 రోజుల్లో సాధించిన మరో ఘనత ఏంటంటే.. నైజాంలో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. కేవలం నైజాం మాత్రమే కాకుండా.. గుంటూరు, కృష్ణాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఇప్పుడా మొత్తాన్ని మరింత పెంచుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 31.47 కోట్లు
సీడెడ్ – 10.44 కోట్లు
ఉత్తరాంద్ర – 10.25 కోట్లు
గుంటూరు – 7.85 కోట్లు
ఈస్ట్ – 7.05 కోట్లు
కృష్ణా – 5.76 కోట్లు
వెస్ట్ – 4.65 కోట్లు
నెల్లూరు – 3.12 కోట్లు
ఏపీ, నైజాం టోటల్ షేర్ – 80.59 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – 7.75 కోట్లు
ఓవర్సీస్ – 12.1 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 100.44 కోట్లు

ALSO READ: సర్కారు వారి పాట లో మహేష్ కు నచ్చిన బ్లాక్

First Published:  17 May 2022 10:03 AM GMT
Next Story