Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ టైమ్ స్టేజ్ పై స్టెప్పులేసిన మహేష్

స్టేజ్ పై సీరియస్ గా మాట్లాడే మహేష్ ను చూశాం. వేదికపై కాలర్ ఎగరేసిన మహేష్ ను చూశాం. నిండు సభలో పంచ్ లేసిన మహేష్ ను కూడా చూశాం. మరి స్టేజ్ పై స్టెప్పులేసే మహేష్ ను చూశారా?ఇప్పుడా టైమ్ వచ్చేసింది. మహేష్ స్టేజ్ పై స్టెప్పులేశాడు. అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు. కర్నూల్ లో జరిగింది ఈ అరుదైన ఘటన. సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. […]

ఫస్ట్ టైమ్ స్టేజ్ పై స్టెప్పులేసిన మహేష్
X

స్టేజ్ పై సీరియస్ గా మాట్లాడే మహేష్ ను చూశాం. వేదికపై కాలర్ ఎగరేసిన మహేష్ ను చూశాం. నిండు సభలో పంచ్ లేసిన మహేష్ ను కూడా చూశాం. మరి స్టేజ్ పై స్టెప్పులేసే మహేష్ ను చూశారా?ఇప్పుడా టైమ్ వచ్చేసింది. మహేష్ స్టేజ్ పై స్టెప్పులేశాడు. అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు. కర్నూల్ లో జరిగింది ఈ అరుదైన ఘటన.

సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.

సర్కారువారి పాట సినిమాలో మ..మ..మహేషా అనే మాస్ సాంగ్ ఉంది. ఈ పాటకు డాన్సర్లతో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అయ్యాడు తమన్. పాట అప్పుడే స్టార్ట్ అయింది. అంతే, అప్పటివరకు కింద కుర్చీలో కామ్ గా కూర్చున్న మహేష్ ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు. వడివడిగా స్టేజ్ ఎక్కేశాడు. సరిగ్గా పాట స్టార్ట్ అయ్యే సమయానికి స్టెప్పు అందుకున్నాడు.

ఊహించని విధంగా మహేష్ స్టెప్పులు వేయడంతో అంతా అవాక్కయ్యారు. ఆ అశ్చర్యంతోనే మహేష్ తో పాదం కలిపారు. తమన్ అయితే తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాడు. జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతిగా దాన్ని చెప్పుకొచ్చాడు.

First Published:  17 May 2022 10:01 AM GMT
Next Story