Telugu Global
Cinema & Entertainment

పుకార్లు నమ్మొద్దు ప్లీజ్.. నిర్మాత అభ్యర్థన

ఈమధ్య కాలంలో ఏజెంట్ సినిమాపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పుకార్లు ఏంటో ఓసారి చూద్దాం. ఏజెంట్ సినిమా ఆగిపోయిందని కొందరన్నారు. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ నుంచి నిర్మాతగా తప్పుకున్నాడనేది మరో పుకారు. ఇక సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడిందనేది మరో పుకారు. మూవీకి బడ్జెట్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయనేది ఇంకో రూమర్. ఇలా చెప్పుకుంటూపోతే […]

పుకార్లు నమ్మొద్దు ప్లీజ్.. నిర్మాత అభ్యర్థన
X

ఈమధ్య కాలంలో ఏజెంట్ సినిమాపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పుకార్లు ఏంటో ఓసారి చూద్దాం.

ఏజెంట్ సినిమా ఆగిపోయిందని కొందరన్నారు. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ నుంచి నిర్మాతగా తప్పుకున్నాడనేది మరో పుకారు. ఇక సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడిందనేది మరో పుకారు. మూవీకి బడ్జెట్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయనేది ఇంకో రూమర్. ఇలా చెప్పుకుంటూపోతే 3-4 పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటిపై క్లారిటీ ఇవ్వకుండా సింగిల్ లైన్ లో తనదైన స్టయిల్ లో వివరణ ఇచ్చాడు దర్శకుడు అనీల్ సుంకర.

“ఏజెంట్ షెడ్యూల్ మనాలీలో స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ పై అప్ డేట్ ఇస్తాం. సినిమా అప్ డేట్స్ కోసం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను మాత్రమే ఫాలో అవ్వండి. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు.”

ఇలా ఏజెంట్ అప్ డేట్స్ ఇస్తూనే, పుకార్లు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. ఇందులో ఇంటలిజెన్స్ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు అఖిల్. దీనికోసం అతడు సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు. హెయిర్ స్టయిల్ మార్చాడు. పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సాక్షి వైద్య ఈ సినిమాకు హీరోయిన్ గా పరిచయమౌతోంది.

First Published:  17 May 2022 9:56 AM GMT
Next Story