Telugu Global
Cinema & Entertainment

పెద్ద హీరోలు వచ్చేశారు .. ఇక చిన్న హీరోల వంతు

కరోనా వల్ల ఎన్నో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్నో సినిమాలు విడుదల కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూశాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు నటించిన ఎన్నో సినిమాలు షూటింగ్ నిలిచి కొన్ని రోజులు, విడుదల చేసేందుకు తగిన సిచువేషన్ కోసం మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. కరోనా కాలంలో మొదలైన కొన్ని చిన్న సినిమాలు వైరస్ వ్యాప్తి తగ్గినప్పుడు, లాక్ డౌన్ సడలించినప్పుడు, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు విడుదల అయ్యాయి. అగ్ర […]

పెద్ద హీరోలు వచ్చేశారు .. ఇక చిన్న హీరోల వంతు
X

కరోనా వల్ల ఎన్నో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎన్నో సినిమాలు విడుదల కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూశాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు నటించిన ఎన్నో సినిమాలు షూటింగ్ నిలిచి కొన్ని రోజులు, విడుదల చేసేందుకు తగిన సిచువేషన్ కోసం మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. కరోనా కాలంలో మొదలైన కొన్ని చిన్న సినిమాలు వైరస్ వ్యాప్తి తగ్గినప్పుడు, లాక్ డౌన్ సడలించినప్పుడు, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు విడుదల అయ్యాయి. అగ్ర హీరోలు నటించిన సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు విడుదల కోసం మూడు నాలుగేళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది.

కరోనా తగ్గిన తర్వాత రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారిపాట వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. చాలా రోజులుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ -3 మాత్రమే ఉంది. ఆ మూవీ ఈనెల 27వ తేదీన విడుదల కానుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు తెరపైకి ఇక వరుసగా చిన్న సినిమాలు రానున్నాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తే నష్టపోతామని భావించిన చాలా మంది చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాల విడుదల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాల సందడి ముగియడంతో ఇక వరుసగా చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.

జూన్ 3వ తేదీన అడివి శేష్ హీరోగా నటించిన మేజర్, నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాలు విడుదల కానున్నాయి. 17వ తేదీన రవి తేజ రామారావు ఆన్ డ్యూటీ, 24న కార్తికేయ సమ్మతమే, మరి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక జూలైలో ఒకటవ తేదీన రానా విరాట పర్వం, వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా, గోపీచంద్ పక్కా కమర్షియల్, 8వ తేదీన నాగచైతన్య థాంక్యూ, 14వ తేదీన రామ్ ది వారియర్, 22న నిఖిల్ కార్తికేయ-2, 29న అడివి శేష్ హిట్ -2 సినిమాలు తెరపైకి రానున్నాయి.

ఆగస్టు 5వ తేదీన కళ్యాణ్ రామ్ బింబిసార, 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం, 25వ తేదీన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా చిన్న సినిమాలు విడుదలకు క్యూ కట్టనున్నాయి. ఇందులో బింబిసార, లైగర్ సినిమాలను మాత్రం హీరోల మార్కెట్ కు మించి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ALSO REDA: ఎఫ్3లో ఫన్ మాత్రమే ఉండదు..!

First Published:  17 May 2022 1:06 AM GMT
Next Story