Telugu Global
Cinema & Entertainment

ఈ సారి ప్రేక్షకులను 'ఖుషి' చేసే బాధ్యత విజయ్ -సామ్ లది..!

2001లో విడుదలైన ప్రేమకథా చిత్రం ఖుషి ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరింపజేసిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన పవన్ కళ్యాణ్, భూమిక తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ […]

ఈ సారి ప్రేక్షకులను ఖుషి చేసే బాధ్యత విజయ్ -సామ్ లది..!
X

2001లో విడుదలైన ప్రేమకథా చిత్రం ఖుషి ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరింపజేసిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన పవన్ కళ్యాణ్, భూమిక తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఇటీవలే కశ్మీర్లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా, సమంత సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 23వ తేదీన ఖుషి చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రేమకథా చిత్రాల్లో ఆల్ టైం హిట్ గా ఖుషి నిలవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు భారీ స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. భూమిక కూడా ఈ ఒక్క సినిమాతోనే టాప్ పొజిషన్ కు చేరుకుంది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంతలకు ఈ ఖుషి మూవీ ఎటువంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి.

First Published:  16 May 2022 12:24 AM GMT
Next Story