Telugu Global
National

గెలుపు కోసం బీజేపీ అడ్డదారులు.. మోడీ సర్కార్ 3 వేల కోట్ల స్కాం

భారత రాజకీయాలు 2014కు ముందు ఆ తర్వాత‌ అని మాట్లాడుకోవాల్సి రావచ్చు. అవినీతి, అధికార దాహం అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ అవి వ్యవస్థీకృతం అయ్యింది మాత్రం 2014 తర్వాతే. గెలవడం కోసం ఎంతకైనా తెగించడం.. ప్రమాదకర పరిస్థితులను సృష్టించడం.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం.. అధికారం అండతో నేరాలు.. మూక దాడులు.. హత్యలు.. 2014 తర్వాతే పెరిగి పోయాయి. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడంతోనే ఆగకుండా ప్రభుత్వాలే వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడటం ఇప్పుడు నడుస్తున్న […]

గెలుపు కోసం బీజేపీ అడ్డదారులు.. మోడీ సర్కార్ 3 వేల కోట్ల స్కాం
X

భారత రాజకీయాలు 2014కు ముందు ఆ తర్వాత‌ అని మాట్లాడుకోవాల్సి రావచ్చు. అవినీతి, అధికార దాహం అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ అవి వ్యవస్థీకృతం అయ్యింది మాత్రం 2014 తర్వాతే. గెలవడం కోసం ఎంతకైనా తెగించడం.. ప్రమాదకర పరిస్థితులను సృష్టించడం.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం.. అధికారం అండతో నేరాలు.. మూక దాడులు.. హత్యలు.. 2014 తర్వాతే పెరిగి పోయాయి. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడంతోనే ఆగకుండా ప్రభుత్వాలే వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడటం ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఏ బలమూ లేని చోట కూడా గెలవాలంటే ఏం చెయ్యాలో చేసి చూపించింది బీజేపీ. గెలవడం కోసం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా.. విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఓటర్లకు పంచడం చేసిన కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బహిర్గతమైంది.

రైతుల కోసం అంటూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామంటూ ప్రధాని మోదీ 2019లో ప్రకటించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ స్కీమ్ అసలు కథ ఏంటో బైటపెట్టింది ఇంగ్లీష్ వెబ్ సైట్ ‘స్క్రోల్ డాట్ ఇన్’ . బిజెపి గెలవడం కోసం 3 వేల కోట్ల రూపాయలకు పైగా ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ సొమ్మును అనర్హులకు పప్పు బెల్లాలు పంచినట్టు పంచేశారు. అస్సాంలో మొదలైన ఈ కథ అనేక రాష్ట్రాలకు పాకింది.

స్క్రోల్ ప్రకారం….పౌరసత్వ చట్ట సవరణ పై అస్సాంలో తీవ్ర నిరసనలు ఎదుర్కొన్న అస్సాం బీజేపీ అందులోంచి బైటపడేందుకు తీవ్ర ఒత్తిడికి గురైంది. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు ఎలాగైనా గెల్చుకోవాలన్న పట్తుదలగా ఉన్న బీజేపీ అందుకు ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ స్కీమ్ ను ఎన్నుకొంది బీజేపీ. రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసే ఈ పథకం బీజేపీకి వరంగా మారింది. గ్రహీతలను గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. వారి జాబితాలను రూపొందించి, రాష్ట్రం ఆమోదించిన తర్వాత, కేంద్రం నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బును బదిలీ చేస్తుంది. అయితే గ్రహీతల లిస్ట్ ను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బీజేపీ నాయకులు తయారు చేశారు. రైతులు కాకపోయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు, వాళ్ళ బందువులు, కొందరు ఉద్యోగుల పేర్లతో లిస్ట్ తయారు చేసి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు బదిలీ చేశారు. ఈ స్కాంలో ఛీఫ్ సెక్రటరీ స్థాయి అధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ప్రమేయం ఉంది. ఈ పథకం తమకెంతో సహాయపడిందని అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్ దాస్ స్వయంగా ఒప్పుకున్నారు. ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి తాము కలిశామని ఆయన తెలిపారు.

లోక్ సభ ఎన్నికలకు మూడునెలల ముందే పథకం ప్రకారం ప్రారంభించారు ఈ స్కీంను. మూడు నెలల్లో వీలైనంత ఎక్కువ మంది ఖాతాల్లోకి డబ్బులు పంపించేందుకు వీలుగా తాత్కాలికంగా వేలాది మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. బీజేపీ బలంగా లేని చోట్ల వీళ్ళ సేవలు ఉపయోగించుకున్నారు. ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళనుండి 5గురు ఉన్న కుటుంబం నుండి 500 రూపాయలు వసూలు చేశారు. వాళ్ళనుండి బీజేపీకే ఓటు వేస్తామని రాతపూర్వక హామీ తీసుకున్నారు. ఒక్కో మనిషికి 6 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో వెంటవెంటనే వేసేశారు.

ఒక్క అస్సాంలోనే 32 లక్షలకు పైగా ఇలాంటి ఎంట్రీలు జరిగితే అందులో 72 శాతం మంది అడ్రస్ ప్రూఫ్ లు కానీ, ఆధార్ కార్డులు కానీ లేవు. 16.7 శాతం మంది అసలు రైతులే కాదు, అందులో కొందరు మైనర్లు. 8.17 శాతం మంది పేర్లు రెండు మూడు సార్లు ఎంట్రీ అయ్యాయి.

కాగా ‘పీఎం కిసాన్‌ స్కీమ్’ ద్వారా 42.16 లక్షల మంది అనర్హులు లబ్ది పొందారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ పార్లమెంట్లో స్వయంగా ఒప్పుకున్నారు. వీరి నుండి 2,992.75 కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సి ఉన్నదని చెప్పారాయన.

ఈ 3 వేల కొట్లలో అస్సాంలో 500 కోట్లు, పంజాబ్ లో 357.9 కోట్లు, మహారాష్ట్రలో 340.6 కోట్లు, తమిళనాడులో 258.6 కోట్లు, ఉత్తరప్రదేశ్ లో 201.2 కోట్ల రూపాయలు అనర్హుల ఖాతాల్లోకి చేరిపోయాయి.

ఎన్నికల్లో గెలవడం కోసం ఇంత పెద్ద స్కాం కు తెగపడ్డ బీజేపీ తమ ప్రత్యర్థులపై అవినీతిపరులని ముద్రలు వేస్తూ…. తమ సోషల్ మీడియా టీం ల ద్వారా వ్యక్తిత్వ హననాలు చేయడం విచిత్రంగా లేదా ?

ఎన్ని అబద్దాలైనా ఆడండి కానీ గెలవండి…ఎన్ని వైషమ్యాలైనా రెచ్చ గొట్టండి కానీ గెలవండి…. ఎంత నెత్తురైనా పారించండి కానీ గెలవండి…. ఎన్ని స్కాం లైనా చేయండి కానీ గెలవండి…. అని రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు బోదిస్తున్నంత కాలం వాళ్ళు గెలుస్తారేమో కానీ ప్రజలు ఓడిపోతూనే ఉంటారు.

First Published:  15 May 2022 7:30 PM GMT
Next Story