Telugu Global
NEWS

ఆంధ్రా మొగాళ్లకు లైంగిక భాగస్వాములు అధికం

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మగవారు.. ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న ఏపీ మగవారు తమకు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ మగవాళ్ల జీవిత కాలంలో నలుగురు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉంటున్నారని సర్వే చెబుతోంది. ఏపీ మగవాళ్లు […]

ఆంధ్రా మొగాళ్లకు లైంగిక భాగస్వాములు అధికం
X

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మగవారు.. ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు తేలింది.

సర్వేలో పాల్గొన్న ఏపీ మగవారు తమకు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ మగవాళ్ల జీవిత కాలంలో నలుగురు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉంటున్నారని సర్వే చెబుతోంది. ఏపీ మగవాళ్లు తమ జీవిత కాలంలో సరాసరి 4.7 మంది మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ మగవారు తమ జీవిత కాలంలో ముగ్గురితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారని తేలింది.

కర్నాటక మగవారి స్కోర్‌ 2.7 గాను, అండమాన్- నికోబార్‌ మగవారు 2.8 గాను,తమిళనాడు మగవారి స్కోర్ 1.8గాను ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. కేరళలో మగవారు ఒకే భాగస్వామికి పరిమితం అవుతున్నట్టు సర్వే చెబుతోంది. హెచ్‌ఐవీ వ్యాప్తి తీరుతెన్నులను తెలుసుకోవడంతో భాగంగా ఈ అంశంపైనా సర్వే నిర్వహించారు.

అయితే ఈ సర్వే ఆధారంగా ఏపీలోని ప్రతి మగాడు నలుగురు, ఐదుగురు మహిళలతో లైంగిక సంబంధాలున్నాయని చెప్పలేం. ఈ సర్వే కూడా తీసుకున్న శాంపిల్స్‌, డేటా ఆధారంగా ఒక అంచనా లాంటిది మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. సర్వేలో పాల్గొన్న వారు చెప్పిన అంశాలే అందరికీ వర్తిస్తాయని కూడా చెప్పలేం.

First Published:  15 May 2022 10:07 PM GMT
Next Story