Telugu Global
National

అసోంలో వరద బీభత్సం.. ఆరు జిల్లాల్లో హై అలర్ట్..

అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నదులన్నీ చెలియలి కట్టలు దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలకు అసోంలోని ఆరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. కొపిలి నది ప్రవాహ తీవ్రత ప్రమాద స్థాయిని దాటింది. ఆర్మీ, పార మిలటరీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాచర్ జిల్లాలో 2150 మందిని రక్షించారు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది. అసోంలోని పలు జిల్లాల్లో రోడ్లు, […]

అసోంలో వరద బీభత్సం.. ఆరు జిల్లాల్లో హై అలర్ట్..
X

అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నదులన్నీ చెలియలి కట్టలు దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలకు అసోంలోని ఆరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. కొపిలి నది ప్రవాహ తీవ్రత ప్రమాద స్థాయిని దాటింది. ఆర్మీ, పార మిలటరీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాచర్ జిల్లాలో 2150 మందిని రక్షించారు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది. అసోంలోని పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఏకంగా రైల్వే స్టేషన్లు సైతం నీట మునిగాయి.

విరిగపడుతున్న కొండచరియలు..
భారీ వర్షాలకు అసోంలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. డిమాహసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండ చరియలు విరిగి పడి ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకూ వరదల వల్ల నలుగురు దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇంకా వరద నీటిలో చిక్కుకొనిపోయారు. రవాణా పూర్తిగా స్తంభించింది.

రోడ్డు మార్గాలు మాసుకుపోయాయి. రైల్వే ట్రాక్ ల పైకి వరదనీరు రావడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. రెండు రైళ్లు మార్గ మధ్యలో నిలిచిపోయాయి. రైళ్లలో ఉన్న వారిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు రైల్వే స్టేషన్లలో కూడా వందలాదిమంది పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోడానికి కూడా వీలు లేకుండా పోయింది. వర్షాలు, వరదలతో అసోం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

First Published:  15 May 2022 8:33 AM GMT
Next Story