Telugu Global
National

చర్చిలో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్ కి విలువ ఉందా..? లేదా..?

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జారీ చేసే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికెట్ ని.. అన్నిచోట్లా పరిగణలోకి తీసుకుంటారు. అదే సమయంలో చర్చి ఇచ్చే సర్టిఫికెట్ కి కూడా విలువ కచ్చితంగా ఉంటుంది. కానీ తాజాగా ఆధార్ కార్డ్ లో పేరు మార్పు కోసం ఈ సర్టిఫికెట్ చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితురాలు కోర్టు మెట్లెక్కింది. దీనిపై బాంబై హైకోర్టు కేంద్రం వివరణ కోరింది. ఆధార్ లో పేరు మార్పుకోసం చర్చి సర్టిఫికెట్ చెల్లుబాటవుతుందా లేదా స్పష్టం చేయాలని […]

చర్చిలో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్ కి విలువ ఉందా..? లేదా..?
X

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జారీ చేసే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికెట్ ని.. అన్నిచోట్లా పరిగణలోకి తీసుకుంటారు. అదే సమయంలో చర్చి ఇచ్చే సర్టిఫికెట్ కి కూడా విలువ కచ్చితంగా ఉంటుంది. కానీ తాజాగా ఆధార్ కార్డ్ లో పేరు మార్పు కోసం ఈ సర్టిఫికెట్ చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితురాలు కోర్టు మెట్లెక్కింది. దీనిపై బాంబై హైకోర్టు కేంద్రం వివరణ కోరింది. ఆధార్ లో పేరు మార్పుకోసం చర్చి సర్టిఫికెట్ చెల్లుబాటవుతుందా లేదా స్పష్టం చేయాలని తెలిపింది.

రోమన్ క్యాథలిక్ మతానికి చెందిన మౌరిసా అల్మేడా, స్వప్నిల్ వివాహం 2021 డిసెంబర్ 26న మహారాష్ట్ర లోని వసాయ్ లో అవర్ లేడీ ఆఫ్ మెర్సీ చర్చిలో జరిగింది. ఆ తర్వాత వారికి జనవరి 19న చర్చి తరపున మ్యారేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అటెస్టేషన్, నోటరీ అన్నీ పూర్తయ్యాయి. హోంశాఖ కూడా ఈ మ్యారేజ్ చెల్లుబాటు అవుతున్నట్టు రిజిస్ట్రేషన్ స్టాంప్ కూడా వేసింది. విచిత్రం ఏంటంటే.. మిగతా అన్ని విషయాల్లో చెల్లుబాటు అవుతున్న ఈ సర్టిఫికెట్, ఆధార్ లో పేరు మార్చడానికి మాత్రం పనికిరాదట. ఆధార్ లో పేరు మార్చే విషయంలో ఉన్న నిబంధనలు అలా ఉన్నాయి మరి.

పెళ్లి తర్వాత తన ఆధార్ కార్డ్ లో ఇంటి పేరు మార్పుకోసం వసాయ్ లోని ఆధార్ సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుంది అల్మేడా. అప్లికేషన్ పరిశీలించిన తర్వాత పేరు మార్పుకోసం జతచేసిన మ్యారేజ్ సర్టిఫికెట్ చెల్లదంటూ ఆధార్ కేంద్రం తెలిపింది. క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ ముందు పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికెట్ లేదా, గెజిట్ లో పేరు మార్చుకున్నట్టు సర్టిఫికెట్ తెస్తేనే చెల్లుబాటు అవుతుందని, చర్చి ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని ఆధార్ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. దీనిపై బాధితురాలు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దీనిపై స్పందించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఇది కేవలం అల్మేడాకి సంబంధించిన సమస్యకాదని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఆధార్ నియమ నిబంధనల్లో మార్పులు తీసుకు రావాలని సూచించింది.

First Published:  13 May 2022 2:46 AM GMT
Next Story