Telugu Global
NEWS

నారాయణ నైతికతను ప్రశ్నార్థకం చేసిన ఇంటర్వ్యూ

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అవడం, గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడం జరిగిపోయింది. న్యాయస్థానం ముందు నారాయణ తరపు న్యాయవాదులు ఒక అంశాన్ని చాలా గట్టిగా వినిపించారు. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకునే కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేసింది. 2014లోనే విద్యాసంస్థలకు నారాయణ రాజీనామా చేశారని.. కాబట్టి నారాయణకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదంటూ లాయర్లు కోర్టులో వాదించారు. రాజీనామా పత్రాన్ని కూడా కోర్టుకు చూపించారు. […]

నారాయణ నైతికతను ప్రశ్నార్థకం చేసిన ఇంటర్వ్యూ
X

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అవడం, గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడం జరిగిపోయింది. న్యాయస్థానం ముందు నారాయణ తరపు న్యాయవాదులు ఒక అంశాన్ని చాలా గట్టిగా వినిపించారు. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకునే కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చేసింది.

2014లోనే విద్యాసంస్థలకు నారాయణ రాజీనామా చేశారని.. కాబట్టి నారాయణకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదంటూ లాయర్లు కోర్టులో వాదించారు. రాజీనామా పత్రాన్ని కూడా కోర్టుకు చూపించారు. కాకపోతే ప్రస్తుతం కూడా తానే నారాయణ సంస్థలను నడుపుతున్నట్టు ఒక ఇంటర్వ్యూలో నారాయణ స్వయంగా ఇటీవల చెప్పారు.

గతంలో మంత్రి పదవి రాగానే విద్యాసంస్థల బాధ్యతలను పిల్లలకు అప్పగించాను.. ఇప్పుడు తిరిగి తానే చూస్తున్నా అంటూ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ ఆంగీకరించారు. పైగా ఒక ప్రైవేట్ చానల్ చేసిన ఈ ఇంటర్వ్యూను నారాయణ విద్యాసంస్థలకు చెందిన యూ ట్యూబ్‌ చానల్‌లోనూ అప్‌లోడ్ చేశారు. విద్యాసంస్థల చానల్‌లోనూ నారాయణను నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా చూపడం విశేషం.

ఈ ఇంటర్వ్యూ అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యాయస్థానాలను నారాయణ తప్పుదోవ పట్టించారని.. న్యాయస్థానాన్నే బురిడి కొట్టించారని విమర్శలు వస్తున్నాయి. టెక్నికల్‌గా రాజీనామా అంశాన్ని కోర్టుకు చూపి బయటపడినా.. రెండు నెలల క్రితమే ఇచ్చిన ఇంటర్వ్యూలో తానే విద్యాసంస్థలను నడుపుతున్నానంటూ నారాయణ చెప్పిన మాటల సంగతేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తామని ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. మరి హైకోర్టు అయినా నారాయణ ఇంటర్వ్యూ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

First Published:  11 May 2022 9:36 PM GMT
Next Story