Telugu Global
Cinema & Entertainment

'అల్లూరి'గా శ్రీవిష్ణు..!

టాలీవుడ్ యువ హీరోల్లో శ్రీవిష్ణుది ప్రత్యేక శైలి. అతడు కెరీర్ ఆరంభం నుంచి ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేని కథలు ఎంచుకుంటూ విలక్షణ హీరోగా గుర్తింపు పొందాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన శ్రీవిష్ణు తాజాగా మరోసారి ఒక ప్రత్యేక కథాంశాన్ని ఎంచుకున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ప్రదీప్ వర్మ దర్శకుడిగా శ్రీవిష్ణు ఓ […]

అల్లూరిగా శ్రీవిష్ణు..!
X

టాలీవుడ్ యువ హీరోల్లో శ్రీవిష్ణుది ప్రత్యేక శైలి. అతడు కెరీర్ ఆరంభం నుంచి ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేని కథలు ఎంచుకుంటూ విలక్షణ హీరోగా గుర్తింపు పొందాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన శ్రీవిష్ణు తాజాగా మరోసారి ఒక ప్రత్యేక కథాంశాన్ని ఎంచుకున్నాడు.

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ప్రదీప్ వర్మ దర్శకుడిగా శ్రీవిష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు “అల్లూరి” అనే టైటిల్ పెట్టినట్లు మంగళవారం నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఖాకీ యూనిఫాం లో శ్రీవిష్ణు పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇప్పటికే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించిన శ్రీవిష్ణు తొలిసారి తన కెరీర్ లో పోలీస్ గా నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది. అల్లూరి సినిమాలో శ్రీవిష్ణు రోల్ ను దర్శకుడు ప్రదీప్ శర్మ ఎంత పవర్ ఫుల్ గా రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన అర్జున ఫల్గుణ సినిమా ప్లాప్ కావడంతో డీలా పడ్డ శ్రీ విష్ణుకి ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం శ్రీవిష్ణు ఈ సినిమాతో పాటు భళా తందానాన అనే యాక్షన్ మూవీలో కూడా నటిస్తున్నాడు.

First Published:  5 April 2022 3:33 AM GMT
Next Story