Telugu Global
Cinema & Entertainment

అందరికంటే ముందు గని చూసిన బన్నీ

8వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది గని సినిమా. అయితే అంతలోనే ఈ సినిమా చూశాడు బన్నీ. ఆ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. “గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి గురించి చెప్పాలి. నేను సినిమా చూశాను.. చాలా బాగుంది అది ఎంత […]

అందరికంటే ముందు గని చూసిన బన్నీ
X

8వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది గని సినిమా. అయితే అంతలోనే ఈ సినిమా చూశాడు బన్నీ. ఆ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు.

“గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి గురించి చెప్పాలి. నేను సినిమా చూశాను.. చాలా బాగుంది అది ఎంత బాగుంది అనేది మీరు చెప్పాలి. అందుకే దర్శకుడు కిరణ్ కు అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను.”

ఇలా గని సినిమా చూసిన విషయాన్ని బయటపెట్టాడు బన్నీ. ఈ సినిమాతో బన్నీ అన్నయ్య బాబి నిర్మాతగా పరిచయమౌతున్నాడు. అన్నయ్య టేస్ట్ తెలుసుకునేందుకే ఇలా అందరికంటే ముందు గని సినిమా చూశానంటున్నాడు అల్లు అర్జున్

“మా ఫ్యామిలీలో నాన్నగారు అల్లు అరవింద్ తర్వాత తమ్ముడు శిరీష్ నిర్మాత అవుతాడు అనుకున్న.. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు మా అన్నయ్య అల్లు బాబి అధికారికంగా నిర్మాతగా మారి మొదటి సినిమా చేశాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బాబికి మొదటి సినిమా అయి ఉండొచ్చు కానీ నా ప్రతి సినిమా విషయంలో బాబి జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది.”

గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించాడు. ఉపేంద్ర, నదియ, నరేష్ లాంటి సీనియర్లు ఇందులో నటించారు. తమన్ సంగీతం అందించాడు.

First Published:  3 April 2022 6:50 AM GMT
Next Story