Telugu Global
National

రైల్వే టూరిజం.. భారత్ లో ఇదో కొత్త ట్రెండ్..

కరోనా తర్వాత వ్యవస్థల్లో చాలా మార్పులొచ్చాయి. వివిధ సంస్థలు మానవ వనరులను బాగా తగ్గించేశాయి. ఒకేచోట ఉండి పనిచేయాలనే నిబంధన కూడా లేకుండా పోయింది. ఆఫీస్ అనే దానికి అర్థం మారిపోయింది. ఈ క్రమంలో ప్రజల జీవన విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. విలాసాలు, విహార యాత్రలవైపు దృష్టిసారించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీన్ని గుర్తించిన భారత రైల్వే శాఖ ఇప్పుడు కొత్తగా టూరిజం ట్రైన్స్ ని ప్రవేశ పెడుతోంది. ఇప్పటి వరకూ మనకు ప్యాసింజర్ రైళ్లు, […]

రైల్వే టూరిజం.. భారత్ లో ఇదో కొత్త ట్రెండ్..
X

కరోనా తర్వాత వ్యవస్థల్లో చాలా మార్పులొచ్చాయి. వివిధ సంస్థలు మానవ వనరులను బాగా తగ్గించేశాయి. ఒకేచోట ఉండి పనిచేయాలనే నిబంధన కూడా లేకుండా పోయింది. ఆఫీస్ అనే దానికి అర్థం మారిపోయింది. ఈ క్రమంలో ప్రజల జీవన విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. విలాసాలు, విహార యాత్రలవైపు దృష్టిసారించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీన్ని గుర్తించిన భారత రైల్వే శాఖ ఇప్పుడు కొత్తగా టూరిజం ట్రైన్స్ ని ప్రవేశ పెడుతోంది.

ఇప్పటి వరకూ మనకు ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లు అనేవి మాత్రమే తెలుసు. ఇకపై టూరిజం రైళ్లు అనే కాన్సెప్ట్ కూడా మొదలు కాబోతోంది. భారత్ గౌరవ్ అనే పథకం ద్వారా రైల్వే టూరిజం ను అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ఆర్టీసీ మాత్రమే ఇలా టూరిస్ట్ బస్సులతో అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇకపై రైల్వే శాఖ కూడా టూరిజం ద్వారా లాభాలు కళ్లజూడబోతోందనమాట. రామాయణ్ ఎక్స్ ప్రెస్ పేరుతో ప్రయోగాత్మకంగా రైల్వే టూరిజం మొదలైంది. గురు కృప ట్రైన్స్ పేరుతో సిక్కుల పుణ్య క్షేత్రాలను కలిపుతూ ఓ టూరిజం ట్రైన్ ప్రవేశ పెట్టబోతున్నారు. కేవలం రైళ్లలో తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో వదిలిపెట్టడమే కాదు.. అక్కడ వసతి, భోజనం, గైడ్ సదుపాయాలు, ఇన్యూరెన్స్ తో సహా ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడమే ఈ టూరిజం ట్రైన్స్ కాన్సెప్ట్. దీనికోసం 150 ట్రైన్స్ లో, 3033 కోచ్ లను సిద్ధం చేసినట్టు తెలిపారు అశ్విని వైష్ణవ్. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తోంది రైల్వే శాఖ.

అయితే కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలకే దీన్ని పరిమితం చేయకుండా.. విహార యాత్రల్లాగా ప్లాన్ చేయబోతున్నారు. వివిధ కంపెనీలు, కాలనీ వాసులు, ఇతర సంఘాలు.. ఇలా సమూహాలుగా వచ్చేవారికి రాయితీ ఇస్తామంటున్నారు. గతంలో ప్రైవేట్ కంపెనీలు ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటూ ప్యాకేజీలు ఆఫర్ చేసేవి. ఇప్పుడు నేరుగా రైల్వే ఈ రంగంలోకి దిగింది. భారత్ లో టూరిజం పట్ల పెరుగుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది.

First Published:  23 Nov 2021 9:49 PM GMT
Next Story