Telugu Global
National

చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు.. నలుగురు శిశువుల దుర్మరణం..!

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డు (ఎస్ ఎన్ సీయూ)లో వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి నలుగురు శిశువులు దుర్మరణం పాలయ్యారు. మూడో అంతస్తులోని ఐసీయూలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వారి పిల్లలను […]

చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు.. నలుగురు శిశువుల దుర్మరణం..!
X

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డు (ఎస్ ఎన్ సీయూ)లో వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి నలుగురు శిశువులు దుర్మరణం పాలయ్యారు. మూడో అంతస్తులోని ఐసీయూలో రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దాంతో తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొని ఆస్పత్రి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారిలో 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన నలుగురు మృతి చెందారు.

సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేశారు.

First Published:  9 Nov 2021 3:04 AM GMT
Next Story