Telugu Global
National

దీదీకి షాక్​.. రూ.5 లక్షల ఫైన్​ విధించిన కోర్టు.. కారణం ఏమిటంటే?

పశ్చిమబెంగాల్​ రాజకీయాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. నిత్యం సంచలనాలు జరగడం అక్కడ మామూలే. సీఎం మమతా బెనర్జీ, అక్కడ పనిచేసే అధికారులు, ప్రతిపక్ష నేతలు ఎప్పుడో ఏదో ఒక వార్తలో నిలుస్తుంటారు. బెంగాల్ లో తాజాగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. అక్కడి హైకోర్టు .. సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షలు జరిమానా విధించింది. ఓ ముఖ్యమంత్రికి కోర్టు ఫైన్​ విధించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల పశ్చిమబెంగాల్​లో జరిగిన […]

దీదీకి షాక్​.. రూ.5 లక్షల ఫైన్​ విధించిన కోర్టు.. కారణం ఏమిటంటే?
X

పశ్చిమబెంగాల్​ రాజకీయాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. నిత్యం సంచలనాలు జరగడం అక్కడ మామూలే. సీఎం మమతా బెనర్జీ, అక్కడ పనిచేసే అధికారులు, ప్రతిపక్ష నేతలు ఎప్పుడో ఏదో ఒక వార్తలో నిలుస్తుంటారు. బెంగాల్ లో తాజాగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. అక్కడి హైకోర్టు .. సీఎం మమతా బెనర్జీకి రూ. 5 లక్షలు జరిమానా విధించింది. ఓ ముఖ్యమంత్రికి కోర్టు ఫైన్​ విధించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఇటీవల పశ్చిమబెంగాల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నందిగ్రామ్​లో పోటీచేసిన మమతా బెనర్జీ మాత్రం.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిలో చేతిలో ఓడిపోయారు. సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్​ నేత. మమతా కు అనుచరుడన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక విషయంలో మమతా బెనర్జీ పలు ఆరోపణలు చేశారు.

సువేందు అధికారి ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలుపొందారని ఆమె ఆరోపించారు. అంతే కాక ఈ విషయంపై సువేందు అధికారిపై ఆమె కేసు పెట్టారు. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్​ కౌశిక్​ చందాపై .. మమతా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కౌశిక్​ చందా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. ఆయనను వెంటనే తాను వేసిన కేసు నుంచి తప్పించాలని ఆమె కోరారు. ఈయన బీజేపీ నేతలతో కలిసి తిరగడాన్ని తాము చూశామని మమతా బెనర్జీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

అయితే ఒక జడ్జి ఒక రాజకీయ పార్టీ నేతలతో కనబడడం సహజమేనని..కానీ కేసుల విచారణ సందర్భంలో ఎలాంటి పక్షపాతం చూపబోరని జస్టిస్ చందా అన్నారు. ఇదిలా ఉంటే ఓ జడ్జిపై నిరాధార ఆరోపణలు చేశారన్న కారణంతో కోల్​కతా హైకోర్టు మమతా బెనర్జీకి రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కోవిడ్​ బాధిత లాయర్ల కుటుంబాలకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

మరోవైపు ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలగుతున్నట్టు జస్టిస్ చందా ప్రకటించారు. కలకత్తా హైకోర్టుకు జడ్జిగా రాకముందు జస్టిస్ చందా బీజేపీ ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారని కలకత్తా బార్ అసోసియేషన్ తెలిపింది. తాను ఒకప్పుడు బీజేపీ కన్వీనర్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని.. కానీనేను ఒక పార్టీ పట్ల పక్షపాతం చూపే వ్యక్తిని కానని చందా పేర్కొన్నారు.

జస్టిస్​ చందా ఈ కేసు నుంచి తప్పుకోవాలని మమతా బెనర్జీ పిటిషన్​ వేయగా .. ఆయన ఈ పిటిషన్​ తోసిపుచ్చారు.అయితే తన ఆత్మ ప్రబోధానుసారం ఈ కేసును తన బెంచ్​ నుంచి తప్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

First Published:  7 July 2021 3:11 AM GMT
Next Story