Telugu Global
National

అన్నాడీఎంకేలో శశి'కలకలం'

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు మరింత రంజుగా మారాయి. పార్టీపై పట్టుకోసం శశికళ ప్రయత్నాలు మొదలు పెట్టగా.. ఆమెకు అంత అవకాశం ఇవ్వకుండా, ఆదిలోనే చెక్ పెట్టేందుకు పార్టీ వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీలోకి నేనొస్తా, పరిస్థితి చక్కదిద్దుతానంటూ శశికళ స్టేట్ మెంట్లు ఇస్తుంటే.. ఆమె అవసరం ఎవరికీ లేదంటూ సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ పిట్టపోరు మధ్యలోకి బీజేపీ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ప్రతిపక్షనేత ఎన్నిక విషయంలోనే మాజీ […]

అన్నాడీఎంకేలో శశికలకలం
X

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు మరింత రంజుగా మారాయి. పార్టీపై పట్టుకోసం శశికళ ప్రయత్నాలు మొదలు పెట్టగా.. ఆమెకు అంత అవకాశం ఇవ్వకుండా, ఆదిలోనే చెక్ పెట్టేందుకు పార్టీ వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీలోకి నేనొస్తా, పరిస్థితి చక్కదిద్దుతానంటూ శశికళ స్టేట్ మెంట్లు ఇస్తుంటే.. ఆమె అవసరం ఎవరికీ లేదంటూ సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ పిట్టపోరు మధ్యలోకి బీజేపీ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

ప్రతిపక్షనేత ఎన్నిక విషయంలోనే మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. చివరకు పళని స్వామి తన పట్టునిలుపుకుని ప్రతిపక్ష నేతగా ఎన్నిక కాగా, ఉప నేత పదవితో పన్నీర్ సెల్వం సరిపెట్టుకున్నారు. అయితే పార్టీపై పెత్తనంకోసం ఎదురు చూస్తున్న శశికళ.. ఈ అంతర్గత రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదిపారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే నేతలతో నేరుగా మాట్లాడుతున్న ఆమె, కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, త్వరలో తాను పార్టీలోకి వస్తానని అన్నీ చక్కదిద్దుతానంటూ ఆమె భరోసా ఇస్తున్నారు. ఈమేరకు ఏఐఏడీఎంకే నేతలతో శశికళ మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు తమిళనాట సంచలనంగా మారాయి.

అయితే శశికళ ఎంట్రీని పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రుల ఉమ్మడి శత్రువు శశికళ పార్టీలోకి వస్తే.. వీరిద్దరి పప్పులు ఉడకవు. మెల్లగా పార్టీపై పెత్తనం సంపాదించి.. ఇద్దర్నీ బయటకు తరిమిసే రకం శశికళ. అందుకే ఇద్దరు మాజీలు అంతలా భయపడుతున్నారు. అసలు ఆమెకు అవకాశం లేకుండా చేసేందుకు సీనియర్లను రెచ్చగొడుతున్నారు. ఈమేరకు పార్టీ తరపున సీనియర్ నేత, డిప్యూటీ కోఆర్డినేటర్ మునుస్వామి పేరుతో ఓ ప్రకటన విడుదల చేయించారు. బహిష్కృత నేత వీకే శశికళను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆప్రకటలో స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నాలను సహించబోమని చెప్పారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ శశికళను తిరిగి ఏఐఏడీఎంలోకి రానివ్వ బోమని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని అన్నారు మునుస్వామి. శశికళకు ఏఐఏడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని చెప్పారు. పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఆమెతో ఫోన్‌ లో మాట్లాడలేదని అన్నారు. ఒక్క కార్యకర్త కూడా ఆమె వలలో చిక్కుకోరని, ఆమెవన్నీ పగటి కలలేనని విమర్శించారు.

First Published:  1 Jun 2021 12:37 AM GMT
Next Story