Telugu Global
National

వచ్చే వారం నుంచి భారత్ లో స్పుత్నిక్-వి టీకా పంపిణీ..

భారత్ ను టీకాల కొరత పట్టి పీడిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకాను భారత మార్కెట్ లో పంపిణీ చేసేందుకు తుది అనుమతులు ఇచ్చింది. ఈమేరకు నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్ వీ.కే.పాల్ ప్రకటించారు. వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వి టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. డీసీజీఐ అనుమతితో స్పుత్నిక్-వి టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకుంది. 1.5 […]

వచ్చే వారం నుంచి భారత్ లో స్పుత్నిక్-వి టీకా పంపిణీ..
X

భారత్ ను టీకాల కొరత పట్టి పీడిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకాను భారత మార్కెట్ లో పంపిణీ చేసేందుకు తుది అనుమతులు ఇచ్చింది. ఈమేరకు నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్ వీ.కే.పాల్ ప్రకటించారు. వచ్చే వారం నుంచి స్పుత్నిక్-వి టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. డీసీజీఐ అనుమతితో స్పుత్నిక్-వి టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకుంది. 1.5 లక్షల వయల్స్ ను తొలి విడతలో రష్యానుంచి తెప్పించారు. తుది అనుమతి వచ్చిన తర్వాత వీటని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంది. కేంద్రం ప్రకటనతో వచ్చే వారం నుంచి వీటిని మార్కెట్లోకి తీసుకొస్తారు. అయితే వీటిని కేంద్రం కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా, లేక పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రులలోనే విక్రయిస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం స్పుత్నిక్-వి టీకాలను రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నా, జూలైనుంచి వీటిని భారత్ లోనే ఉత్పత్తి చేస్తామని వీ.కే. పాల్ తెలిపారు. ఈ నెలాఖరుకు మరో 30 లక్షల స్పుత్నిక్-వి డోసులు భారత్ కు చేరుకోవాల్సి ఉంది.

విదేశీ టీకాలపై కూడా కీలక నిర్ణయం..
కొవాక్సిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో, రాష్ట్రాలకు కేటాయింపులు చేయలేక కేంద్రం సతమతమవుతోంది. అటు రాష్ట్రాలు నేరుగా ఆర్డర్ ఇచ్చినా కూడా ఉత్పత్తి సామర్థ్యం లేక టీకాలు రావడం ఆలస్యం అవుతోంది. దీంతో కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి పెంచాయి. ప్రస్తుతం స్పుత్నిక్-వి టీకా అందుబాటులోకి వచ్చినా కూడా రాష్ట్రాల అవసరాలు తీరతాయని అంచనా వేయలేం. అందుకే.. విదేశీ టీకాల దిగుమతికి వెంటనే అనుమతులిస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అమెరికా ఎఫ్‌.డి.ఎ., ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే టీకాల దిగుమతికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్‌ ల దిగుమతి కోసం తమవద్ద ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌ లో లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ లో టీకా పంపిణీ కోసం ఫైజర్‌, మోడెర్నా సంస్థలు భారత విదేశాంగ శాఖను సంప్రదించినట్టు కేంద్రం తెలిపింది. భారత్‌ లో టీకా ఉత్పత్తికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ కూడా సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. మరోవైపు భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ ఫార్ములాతో ఇతర కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్టు కేంద్రం తెలిపింది.

First Published:  13 May 2021 8:06 AM GMT
Next Story