Telugu Global
NEWS

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కరోనా వార్..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సాక్షిగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కరోనా వార్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా కరోనా కష్టాలకు కారణం మీరంటే మీరంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు. తాజాగా.. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం […]

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కరోనా వార్..
X

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సాక్షిగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కరోనా వార్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా కరోనా కష్టాలకు కారణం మీరంటే మీరంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు. తాజాగా.. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని వెంటనే తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..
తెలంగాణలో కోవిడ్‌ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. పీఎం కేర్‌ నిధుల గురించి పూర్తి నివేదిక ఇచ్చామని, తెలంగాణలో సీఎం కేర్‌ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేషజాలు పక్కనపెట్టి, బీజేపీ సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకమైన నివేదిక ఇస్తే కేంద్రం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు సంజయ్.

కేసీఆర్..! వ్యాక్సిన్ వేయించుకున్నారా..?
సీఎం కేసీఆర్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా? అని ప్రశ్నించారు బండి సంజయ్. వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రజలకు ఆయన ఎందుకు చెప్పడంలేదని అడిగారు. రాష్ట్రానికి ఆక్సిజన్, వ్యాక్సిన్ ఎంతకావాలో స్పష్టత లేదని, ప్రభుత్వం కోవిడ్ మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని, ప్రభుత్వం తప్పుడు లెక్కల ప్రకటనల వల్లే ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్. తెలంగాణలో జరుగుతున్న మినీ మున్సిపల్ పోరులో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. అధికార పార్టీ అవినీతి అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని విమర్శించారు.

First Published:  28 April 2021 6:05 AM GMT
Next Story