Telugu Global
NEWS

జానా గెలుపు కాంగ్రెస్​కు అవసరం..! కానీ సాధ్యమేనా?

సాగర్​ ఉప ఎన్నికను కాంగ్రెస్​ పార్టీ ఎంతో సీరియస్​గా తీసుకున్నది. ఈ గెలుపు జానారెడ్డికి ఎంత అవసరమో.. తెలంగాణ కాంగ్రెస్​ ఉనికికి అంతే ముఖ్యం. ఇదిలా ఉంటే టీఆర్​ఎస్​ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఆలోచనలో పడింది. అందుకే పకడ్బందీ వ్యూహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది. సర్వశక్తులు ఒడ్డి రంగంలోకి దిగితే తమకు తిరుగులేదని టీఆర్​ఎస్​ నిరూపించుకున్నది. సాగర్​ ఉప ఎన్నికను కూడా గులాబీ బాస్​ […]

జానా గెలుపు కాంగ్రెస్​కు అవసరం..! కానీ సాధ్యమేనా?
X

సాగర్​ ఉప ఎన్నికను కాంగ్రెస్​ పార్టీ ఎంతో సీరియస్​గా తీసుకున్నది. ఈ గెలుపు జానారెడ్డికి ఎంత అవసరమో.. తెలంగాణ కాంగ్రెస్​ ఉనికికి అంతే ముఖ్యం. ఇదిలా ఉంటే టీఆర్​ఎస్​ కూడా ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఆలోచనలో పడింది. అందుకే పకడ్బందీ వ్యూహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది. సర్వశక్తులు ఒడ్డి రంగంలోకి దిగితే తమకు తిరుగులేదని టీఆర్​ఎస్​ నిరూపించుకున్నది.

సాగర్​ ఉప ఎన్నికను కూడా గులాబీ బాస్​ కేసీఆర్​ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఎక్కడికక్కడ నేతలను మోహరించారు. పక్కా వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. గ్రామాన్ని, మండలాన్ని యూనిట్​ గా తీసుకొని టీఆర్​ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ తిష్ట వేశారు. గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్​ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ. నేతల మధ్య సమన్వయం ఉండదు. ఎవరికి వారు మేమే గొప్ప అని ఫీలవుతుంటారు. అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పుడు ప్రతి పక్షం కూడా అన్ని శక్తులు కూడదీసుకొని రంగంలోకి దిగాలి. కానీ సాగర్​లో ఆ పరిస్థితి ఉందో లేదో తెలియదు.

మరోవైపు జానారెడ్డి గెలిస్తే ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అది పీసీసీ అధ్యక్ష పదవా? లేక సీఎల్పీ లీడర్​ పదవా? తెలియదు. దీంతో కొందరు నేతలు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొందాలని అధిష్ఠానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికార పార్టీ వ్యూహాలకు, ఎత్తులకు కాంగ్రెస్​ తట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి.

సాగర్​లో సామాజిక సమీకరణాలపై కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక్కడ యాదవ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారంతా మూకుమ్మడిగా టీఆర్​ఎస్​కు ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్​ఎస్​ అభ్యర్థి భగత్​ .. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే బీజేపీ ఎస్టీకి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నారు.

అయితే రెడ్డి సామాజికవర్గ ఓటర్లంతా పార్టీలకతీతంగా జానారెడ్డికి మద్దతు ఇస్తే పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న కూడా విశ్లేషకుల నుంచి వస్తున్నది. ఒకవేళ రెడ్డి సామాజికవర్గం, చాలా కాలంగా అండగా ఉంటున్న దళిత సామాజిక వర్గం మూకుమ్మడిగా కాంగ్రెస్​కు మద్దతు ఇస్తే ఇక్కడ టీఆర్​ఎస్​కు కష్టమే. కానీ టీఆర్​ఎస్​ ఈ సారి పకడ్బందీ వ్యూహాలతో వెళ్తుంది కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

బీజేపీ మాత్రం అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదని విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం తప్పదు అన్న సమాచారం. ఎందుకంటే బీజేపీ నుంచి టికెట్​ ఆశించి భంగపడ్డ కంకణాల నివేదిత రెడ్డి, మరో నేత టీఆర్​ఎస్​లో చేరారు. మరోవైపు ఆపార్టీకి సాగర్​లో క్యాడర్​లో లేదు. చాలా గ్రామాల్లో కార్యకర్తలు కూడా లేరు. దీంతో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడుతారో? అక్కడి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే మే 2 వరకు వేచి చూడక తప్పదు.

First Published:  4 April 2021 3:54 AM GMT
Next Story