Telugu Global
Cinema & Entertainment

బంపరాఫర్ మళ్లీ మొదలైంది

సాయిరాం శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ బంపరాఫర్. ఎట్టకేలకు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈరోజు బంపరాఫర్-2 మూవీ లాంఛనంగా మొదలైంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరై.. సాయిరాం శంకర్ కు శుభాకాంక్షలు అందించాడు. సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా ‘బంపర్ ఆఫర్ 2’ చిత్రం వస్తోంది. ‘బంపర్ ఆఫర్’ విజయం నేపథ్యంలో 12 […]

బంపరాఫర్ మళ్లీ మొదలైంది
X

సాయిరాం శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ బంపరాఫర్. ఎట్టకేలకు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈరోజు బంపరాఫర్-2 మూవీ లాంఛనంగా మొదలైంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రత్యేక అతిథిగా హాజరై.. సాయిరాం శంకర్ కు శుభాకాంక్షలు అందించాడు.

సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా ‘బంపర్ ఆఫర్ 2’ చిత్రం వస్తోంది.

‘బంపర్ ఆఫర్’ విజయం నేపథ్యంలో 12 సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  18 March 2021 3:21 AM GMT
Next Story