Telugu Global
National

జీఎస్‌టీపై చేతులెత్తేసిన కేంద్రం...

కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం చెల్లించాల్సిన జీఎస్‌టీ సొమ్ముపైనా చేతులెత్తేసింది. హంగుఆర్భాటాలతో జీఎస్‌టీని ప్రారంభించిన మోడీ సర్కార్‌… దాని అమలులో మాత్రం ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయింది. తొలిసారి అధికారికంగా చేతులెత్తేసింది. జీఎస్‌టీ వాటాలో రాష్ట్రాలకు కేంద్రం భారీగా బకాయిపడింది. ఆ డబ్బును చెల్లించాలని ఇటీవల రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. కరోనా కారణంగా దారుణంగా ఆదాయం పడిపోవడంతో రాష్ట్రాలు తమకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ సొమ్ము ఇవ్వండి అంటూ కోరుతున్నాయి. అయితే […]

జీఎస్‌టీపై చేతులెత్తేసిన కేంద్రం...
X

కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం చెల్లించాల్సిన జీఎస్‌టీ సొమ్ముపైనా చేతులెత్తేసింది. హంగుఆర్భాటాలతో జీఎస్‌టీని ప్రారంభించిన మోడీ సర్కార్‌… దాని అమలులో మాత్రం ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయింది. తొలిసారి అధికారికంగా చేతులెత్తేసింది.

జీఎస్‌టీ వాటాలో రాష్ట్రాలకు కేంద్రం భారీగా బకాయిపడింది. ఆ డబ్బును చెల్లించాలని ఇటీవల రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. కరోనా కారణంగా దారుణంగా ఆదాయం పడిపోవడంతో రాష్ట్రాలు తమకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ సొమ్ము ఇవ్వండి అంటూ కోరుతున్నాయి. అయితే చావు కబురు చల్లగా చెప్పేసింది కేంద్రం.

జీఎస్‌టీ చట్టంలో చెప్పినట్టుగా రాష్ట్రాలకు జీఎస్‌టీ వాటాను పంచే స్థితిలో కేంద్రం లేదని ఆర్థిక శాఖ పార్లమెంటరీ కమిటీ ముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వెల్లడించారు. దీనిపై కమిటీలోని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా రాష్ట్రాలు ఆదాయం కోల్పోవడంతో పాటు అదే సమయంలో భారీగా వైద్యంపై ఖర్చు చేయాల్సి వస్తోందని… ఈ సమయంలో కేంద్రమే చేతులెత్తేస్తే దేశం ఏమైపోవాలని కమిటీలోని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీనికి కేంద్రం నుంచి సరైన సమాధానం లేదు.

జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలు తమ ఆదాయాన్ని కోల్పోతే , రాష్ట్రాల రాబడిలో వార్షికంగా 14 శాతం వృద్ది లేకపోతే కేంద్రం తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని జీఎస్‌టీ చట్టంలోనే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించింది.

First Published:  2 Aug 2020 9:26 PM GMT
Next Story