Telugu Global
National

పక్కా ఆధారాలున్నాయి అందుకే అరెస్ట్‌... అచ్చెంకు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు...

పూర్తి ఆధారాలు ఉండడం వల్లే ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ రవికుమార్ చెప్పారు. నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే… విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వలేదన్నారు. ఆధారాలు సేకరించి అవకతవకలను గుర్తించిన తర్వాతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మందుల కొనుగోలుకు సంబంధించి ఒకటి, టెలీ హెల్త్‌కు సంబంధించి మరొకటి విడివిడిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖ ఆధారంగానే టెలీహెల్త్‌కు కాంట్రాక్టు అప్పగించారని రవికుమార్ వివరించారు. ఈ […]

పక్కా ఆధారాలున్నాయి అందుకే అరెస్ట్‌... అచ్చెంకు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు...
X

పూర్తి ఆధారాలు ఉండడం వల్లే ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ రవికుమార్ చెప్పారు. నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే… విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వలేదన్నారు.

ఆధారాలు సేకరించి అవకతవకలను గుర్తించిన తర్వాతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మందుల కొనుగోలుకు సంబంధించి ఒకటి, టెలీ హెల్త్‌కు సంబంధించి మరొకటి విడివిడిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు.

అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖ ఆధారంగానే టెలీహెల్త్‌కు కాంట్రాక్టు అప్పగించారని రవికుమార్ వివరించారు. ఈ స్కామ్‌లో ఇంకా దర్యాప్తు జరుగుతోందని… మరింత మందిని విచారించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు అచ్చెన్నాయుడితో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మొత్తం 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. మొత్తం 19 మంది పాత్ర ఈ కుంభకోణంలో గుర్తించినట్టు ఏసీబీ జేడీ వివరించారు.

అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన ఆపరేషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని… దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

అటు మొలలతో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. అచ్చెన్నాయుడుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. కారులో ప్రయాణం చేయడం వల్ల ఆపరేషన్ జరిగిన ప్రాంతం పచ్చిగా మారిందని… రెండు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేవన్నారు.

అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. అచ్చెన్నాయుడి ఆపరేషన్ గాయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గాయం పచ్చిగా మారిందని, గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చని అన్నారు. బీపీకి ఇదివరకు వాడుతున్న మందులే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్‌గానే ఉందని వెల్లడించారు.

First Published:  13 Jun 2020 3:56 AM GMT
Next Story