Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ కు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేశాయి. దీంతో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి షెడ్యూల్స్ రెడీ చేశాడు. రేపట్నుంచే మాక్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే అంశంపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేయడంతో తారక్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా నుంచి […]

ఎన్టీఆర్ సినిమాకు ముహూర్తం ఫిక్స్
X

షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ కు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేశాయి. దీంతో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి షెడ్యూల్స్ రెడీ చేశాడు. రేపట్నుంచే మాక్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే అంశంపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు లైన్ క్లియర్ అయింది.

ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి క్లారిటీ వచ్చేయడంతో తారక్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్రివిక్రమ్ తాజాగా కథ-స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు.

లాక్ డౌన్ టైమ్ లో తారక్ ఫ్రీగా ఉండడం త్రివిక్రమ్ కు కలిసొచ్చింది. అతడితో డిస్కస్ చేసి కథ, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. సో.. దసరా నుంచి సినిమాను పట్టాలపైకి తీసుకురావడమే ఆలస్యం. హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో తారక్, పొలిటీషియన్ గా కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది.

First Published:  12 Jun 2020 4:17 AM GMT
Next Story