Telugu Global
Cinema & Entertainment

త్వరలోనే నంది అవార్డుల వేడుక

కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల వేడుకను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. తనను కలవడానికి వచ్చిన సినీప్రముఖులతో మాట్లాడిన జగన్.. ఈ మేరకు నంది అవార్డుల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 2019-20 సంవత్సరానికి గాను నంది అవార్డుల్ని ప్రకటించడంతో పాటు కుదిరితే ఇదే ఏడాది అవార్డుల ఫంక్షన్ ను కూడా జరిపిస్తామని మాటిచ్చారు. షూటింగ్స్ కు అనుమతి ఇవ్వమని కోరడంతో పాటు మరికొన్ని వినతులతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు కొందరు సినీప్రముఖులు. […]

త్వరలోనే నంది అవార్డుల వేడుక
X

కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల వేడుకను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. తనను కలవడానికి వచ్చిన సినీప్రముఖులతో మాట్లాడిన జగన్.. ఈ మేరకు నంది అవార్డుల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

2019-20 సంవత్సరానికి గాను నంది అవార్డుల్ని ప్రకటించడంతో పాటు కుదిరితే ఇదే ఏడాది అవార్డుల ఫంక్షన్ ను కూడా జరిపిస్తామని మాటిచ్చారు.

షూటింగ్స్ కు అనుమతి ఇవ్వమని కోరడంతో పాటు మరికొన్ని వినతులతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు కొందరు సినీప్రముఖులు. చిరంజీవి నేతృత్వంలో సురేష్ బాబు, నాగార్జున, దిల్ రాజు, సి.కల్యాణ్, రాజమౌళి లాంటి ప్రముఖులు జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ కోరికలపై సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి. ఈనెల 15 నుంచి ఏపీలో షూటింగ్స్ కు అనుమతులు కూడా ఇచ్చారు.

మరోవైపు విశాఖలో సినీపరిశ్రమ అభివృద్ధిపై కూడా కీలక చర్చ జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో టాలీవుడ్ అభివృద్ధి కోసం 3వందలకు పైగా ఎకరాల్ని కేటాయించారు.

ఎవరైనా స్టుడియోలు నిర్మించడానికి, సినిమాలకు సంబంధించిన పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తే.. ఆ స్థలాల్ని ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ స్పష్టంచేశారు.

అంతేకాకుండా.. సినీప్రముఖులు విశాఖకు వస్తామంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరహాలో భారీగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా అన్నారు.

First Published:  9 Jun 2020 7:40 AM GMT
Next Story