Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ లో మరో హీరోయిన్

ఆర్ఆర్ఆర్ పేరు చెప్పగానే రామ్ చరణ్, ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఇక హీరోయిన్ పేరు చెప్పమంటే ఎవరికైనా అలియా భట్ గుర్తొస్తుంది. ఓ విదేశీ హీరోయిన్ కూడా ఉంది. అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు శ్రియ. అవును.. ఆర్ఆర్ఆర్ లో శ్రియ కూడా ఉంది. సినిమాలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు భార్య క్యారెక్టర్ లో శ్రియ […]

ఆర్ఆర్ఆర్ లో మరో హీరోయిన్
X

ఆర్ఆర్ఆర్ పేరు చెప్పగానే రామ్ చరణ్, ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఇక హీరోయిన్ పేరు చెప్పమంటే ఎవరికైనా అలియా భట్ గుర్తొస్తుంది. ఓ విదేశీ హీరోయిన్ కూడా ఉంది. అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు శ్రియ. అవును.. ఆర్ఆర్ఆర్ లో శ్రియ కూడా ఉంది.

సినిమాలో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు భార్య క్యారెక్టర్ లో శ్రియ కనిపించనుంది. తను ఆర్ఆర్ఆర్ లో ఉన్న విషయాన్ని శ్రియ స్వయంగా బయటపెట్టింది. నెటిజన్లతో సోషల్ మీడియాలో ఛాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వస్తానని చెబుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో నటించింది శ్రియ. ఆ తర్వాత మళ్లీ జక్కన్న దర్శకత్వంలో నటించే అవకాశం ఈమెకు రాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

First Published:  8 Jun 2020 9:55 AM GMT
Next Story