Telugu Global
Cinema & Entertainment

లాక్ డౌన్ లో మరో సినిమా ఓకే చేశాడు

లాక్ డౌన్ లో హీరోహీరోయిన్లంతా తమకు నచ్చిన పనులు చేస్తూ హ్యాపీగా కాలం గడిపేస్తున్నారు. నానికి మాత్రం నచ్చే పని ఒకటే. అదే సినిమా. అతడి పనులు, ఆలోచనలు అన్నీ సినిమా చుట్టూనే తిరుగుతుంటాయి. ఎప్పుడూ చేతిలో మినిమం 3 సినిమాలు లేకపోతే నానికి నిద్రపట్టదేమో. తాజాగా ఈ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవును.. బ్రోచేవారెవరురా సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయకు నాని ఛాన్స్ ఇచ్చాడు. నిజానికి నాని-ఆత్రేయ కాంబినేషన్ […]

లాక్ డౌన్ లో మరో సినిమా ఓకే చేశాడు
X

లాక్ డౌన్ లో హీరోహీరోయిన్లంతా తమకు నచ్చిన పనులు చేస్తూ హ్యాపీగా కాలం గడిపేస్తున్నారు. నానికి మాత్రం నచ్చే పని ఒకటే. అదే సినిమా. అతడి పనులు, ఆలోచనలు అన్నీ సినిమా చుట్టూనే తిరుగుతుంటాయి. ఎప్పుడూ చేతిలో మినిమం 3 సినిమాలు లేకపోతే నానికి నిద్రపట్టదేమో. తాజాగా ఈ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అవును.. బ్రోచేవారెవరురా సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయకు నాని ఛాన్స్ ఇచ్చాడు. నిజానికి నాని-ఆత్రేయ కాంబినేషన్ పై చాన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆత్రేయ చెప్పిన ఫుల్ నెరేషన్ కు ఓకే చెప్పాడు నాని. మిగతా డీటెయిల్స్ అన్నీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత బయటకొస్తాయి.

ప్రస్తుతం V సినిమా రిజల్ట్ కోసం నాని వెయిట్ చేస్తున్నాడు. థియేటర్లు తెరిచిన వెంటనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే టక్ జగదీష్ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ మూవీ కూడా లైన్లో ఉంది. ఈ 3 సినిమాల పనులు పూర్తయిన తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా మొదలవుతుంది.

First Published:  13 May 2020 8:30 PM GMT
Next Story