Telugu Global
Cinema & Entertainment

పారితోషికం తగ్గించుకున్న హీరో

లాక్ డౌన్ తో సినీ పరిశ్రమలన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. వేల కోట్ల రూపాయల నష్టాలు చవిచూస్తున్నాయి. తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టడానికి నిర్మాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు షూటింగ్స్ లేక సినీకార్మికులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బాగుంటుందనే వాదన మొదలైంది. దీనికి చాలామంది మద్దతు కూడా తెలిపారు. ఇలాంటి కష్టసమయంలో హీరోలు ఎంతోకొంత తమ పారితోషికాలు తగ్గించుకుంటే ఇండస్ట్రీకి మంచిదంటూ చర్చావేదికలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. […]

పారితోషికం తగ్గించుకున్న హీరో
X

లాక్ డౌన్ తో సినీ పరిశ్రమలన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. వేల కోట్ల రూపాయల నష్టాలు చవిచూస్తున్నాయి. తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టడానికి నిర్మాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు షూటింగ్స్ లేక సినీకార్మికులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బాగుంటుందనే వాదన మొదలైంది. దీనికి చాలామంది మద్దతు కూడా తెలిపారు. ఇలాంటి కష్టసమయంలో హీరోలు ఎంతోకొంత తమ పారితోషికాలు తగ్గించుకుంటే ఇండస్ట్రీకి మంచిదంటూ చర్చావేదికలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది.

తన రెమ్యూనరేషన్ నుంచి 25శాతం తగ్గించుకుంటున్నట్టు హీరో విజయ్ ఆంటోనీ ప్రకటించాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ వివిధ దశల్లో ఆగిపోయాయి. ఈ సినిమాలకు సంబంధించి నిర్మాతపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు.. ప్రతి సినిమాకు 25శాతం పారితోషికం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాడు. అంటే.. 3 సినిమాలకు కలిపి తన 75శాతం రెమ్యూనరేషన్ ను త్యాగం చేస్తున్నాడు ఈ హీరో.

విజయ్ ఆంటోనీతో మొదలైన ఈ కార్యక్రమాన్ని మరింతమంది ముందుకు తీసుకెళ్తారని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, అజిత్ లాంటి హీరోలు తమ పారితోషికాల్ని తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నుంచి ఇలాంటి వార్తలు ఇంకా బయటకు రాలేదు.

First Published:  5 May 2020 7:02 PM GMT
Next Story