Telugu Global
Cinema & Entertainment

కాబోయే భర్త ఇలా ఉండాలట....

నిన్నటికి నిన్న తన కాబోయే వాడు ఎలా ఉండాలో చిన్న క్లారిటీ ఇచ్చింది రాశిఖన్నా. తనకు కాబోయే భర్త చాలా పొడుగ్గా ఉండాలని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి క్వాలిటీనే హీరోయిన్ ప్రణీత కూడా కోరుకుంటోంది. తను కూడా హైట్ గా ఉంటాను కాబట్టి, తనకు కాబోయే వాడు కూడా కనీసం 6 అడుగులు ఉండాలని, 6 అడుగుల 4 అంగుళాలు ఉన్నా తనకు ఇబ్బంది లేదని చెబుతోంది. ఈ కరోనా టైమ్ లో మిగతా హీరోయిన్లతో పోల్చిచూస్తే […]

కాబోయే భర్త ఇలా ఉండాలట....
X

నిన్నటికి నిన్న తన కాబోయే వాడు ఎలా ఉండాలో చిన్న క్లారిటీ ఇచ్చింది రాశిఖన్నా. తనకు కాబోయే భర్త చాలా పొడుగ్గా ఉండాలని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇలాంటి క్వాలిటీనే హీరోయిన్ ప్రణీత కూడా కోరుకుంటోంది. తను కూడా హైట్ గా ఉంటాను కాబట్టి, తనకు కాబోయే వాడు కూడా కనీసం 6 అడుగులు ఉండాలని, 6 అడుగుల 4 అంగుళాలు ఉన్నా తనకు ఇబ్బంది లేదని చెబుతోంది.

ఈ కరోనా టైమ్ లో మిగతా హీరోయిన్లతో పోల్చిచూస్తే ఛారిటీ విషయంలో ప్రణీత చాలా యాక్టివ్ గా ఉంటోంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విరాళం ప్రకటించిన మొదటి హీరోయిన్ గా నిలిచింది. దీనికి తోడు స్వయంగా తనే వంట వండి ప్రతి రోజూ వందల మందికి అన్నదానం చేస్తోంది. ఇలా ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు తన అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ, ఫొటోలు పోస్ట్ చేస్తూ జోష్ నింపుతోంది.

అందంగా ఉన్నప్పటికీ కాలేజ్ డేస్ లో తనకు ఎలాంటి ఎఫైర్లు లేవంటోంది ప్రణీత. చదువుకునే రోజుల్లో తన ధ్యాస మొత్తం చదువుపైనే ఉండేదని, తనకు ఆ టైమ్ లో ఎవ్వరూ ప్రపోజ్ కూడా చేయలేదని చెబుతోంది.

First Published:  4 May 2020 8:11 PM GMT
Next Story