Telugu Global
Cinema & Entertainment

నక్కిన దర్శకత్వంలో రవితేజ

ఇప్పటికే క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇది కంప్లీట్ అయిన వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు ఈ హీరో. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు రవితేజ. ఈ మేరకు రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూర్తిచేశాడట రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. పీపుల్ […]

నక్కిన దర్శకత్వంలో రవితేజ
X

ఇప్పటికే క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇది కంప్లీట్ అయిన వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు ఈ హీరో.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు రవితేజ. ఈ మేరకు రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూర్తిచేశాడట రచయిత బెజవాడ ప్రసన్నకుమార్. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ చిన్న ట్విస్ట్ ఉంది. నిజానికి త్రినాథరావు నక్కిన, బెజవాడ ప్రసన్నకుమార్ కలిసి కథ రెడీ చేసింది రవితేజ కోసం కాదు. వెంకటేష్ కోసం కథ రాసుకున్నాడు. కానీ ఎప్పట్లానే వెంకటేష్ దగ్గర ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. దీంతో అదే కథకు కొద్దిపాటి మార్పులు చేసి రవితేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనేది వీళ్ల ప్లాన్.

First Published:  26 April 2020 9:09 PM GMT
Next Story