Telugu Global
National

కరోనా తీవ్రత... హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బృందం

లాక్‌డౌన్‌ ఉన్నా కొన్ని ప్రధాన నగరాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల్లో పరిస్థితిపై అంచనా వేస్తోంది. పరిస్థితి చేయి దాటే సూచనలు కనిపిస్తే నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతోంది. దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న పలు నగరాలను కేంద్రం గుర్తించింది. ఇందులో హైదరాబాద్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, మహారాష్ట్రలోని థానే, తమిళనాడులోని చెన్నై నగరాలున్నాయి. ఈ ఐదు నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని కేంద్ర […]

కరోనా తీవ్రత... హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర బృందం
X

లాక్‌డౌన్‌ ఉన్నా కొన్ని ప్రధాన నగరాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల్లో పరిస్థితిపై అంచనా వేస్తోంది. పరిస్థితి చేయి దాటే సూచనలు కనిపిస్తే నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతోంది. దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న పలు నగరాలను కేంద్రం గుర్తించింది. ఇందులో హైదరాబాద్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, మహారాష్ట్రలోని థానే, తమిళనాడులోని చెన్నై నగరాలున్నాయి.

ఈ ఐదు నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ నగరాల్లో లాక్‌డౌన్‌ను యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారని… దీని వల్ల కరోనా వ్యాపించి ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నగరాలకు కేంద్ర బృందాలను పంపుతోంది. ఒక్కో నగరానికి ఒక్కో బృందాన్ని కేంద్రం పంపుతోంది.

ఇప్పటికే కేంద్రం పంపిన బృందం ఒకటి హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందాలు ఆయా నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇస్తాయి. నివేదికలను బట్టి కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుంది.

తెలంగాణలో దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ టెస్ట్‌లు మాత్రమే చేస్తున్నారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. గురువారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం 48వేల 34 పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 13వేల 200 మాత్రమే పరీక్షలు నిర్వహించింది. తక్కువ పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల కరోనా తీవ్రత బయటకు రావడం లేదన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

First Published:  25 April 2020 12:35 AM GMT
Next Story