Telugu Global
Cinema & Entertainment

చిరంజీవికి నో.... రవితేజకు గ్రీన్ సిగ్నల్

హీరోయిన్లకు కూడా కొన్ని అంచనాలుంటాయి. తాము చేయబోయే పాత్రలు ఎలా ఉండాలనే అంశంపై ఓ అవగాహన ఉంటుంది. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లయితే ఈ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చిందని కళ్లు మూసుకొని ఒప్పుకోరు. తమ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది చూస్తారు. ప్రస్తుతం త్రిష ఈ పొజిషన్ లోనే ఉంది. అందుకే ఏకంగా చిరంజీవి ఆఫర్ ను వద్దనుకుంది. రవితేజ సరసన నటించేందుకు రెడీ అవుతోంది. లెక్కప్రకారం […]

చిరంజీవికి నో.... రవితేజకు గ్రీన్ సిగ్నల్
X

హీరోయిన్లకు కూడా కొన్ని అంచనాలుంటాయి. తాము చేయబోయే పాత్రలు ఎలా ఉండాలనే అంశంపై ఓ అవగాహన ఉంటుంది. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లయితే ఈ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చిందని కళ్లు మూసుకొని ఒప్పుకోరు. తమ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది చూస్తారు. ప్రస్తుతం త్రిష ఈ పొజిషన్ లోనే ఉంది. అందుకే ఏకంగా చిరంజీవి ఆఫర్ ను వద్దనుకుంది. రవితేజ సరసన నటించేందుకు రెడీ అవుతోంది.

లెక్కప్రకారం చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా త్రిష ఉండాలి. కానీ ఆమె ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో త్రిష స్థానంలో కాజల్ ను తీసుకున్నారు. అలా ఆచార్య నుంచి తప్పుకున్న త్రిష, ఇప్పుడు రవితేజ మూవీకి సైన్ చేసే ఆలోచనలో ఉంది.

రమేష్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే ఓ రీమేక్ చేయబోతున్నాడు రవితేజ. ఆ సినిమాలో హీరోయిన్ గా త్రిష అయితే బాగుంటుందని భావిస్తున్నారట. వెంటనే రమేష్ వర్మ, ఫోన్ లో త్రిషకు కథ చెప్పడం.. త్రిష ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. గతంలో రవితేజ-త్రిష కాంబినేషన్ లో కృష్ణ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

First Published:  23 April 2020 1:30 AM GMT
Next Story