Telugu Global
National

కన్నాపై కేంద్ర బీజేపీ ఆంక్షలు?

ఏపీ బీజేపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనిపై వైసీపీ నుంచి అంతే స్థాయిలో ప్రతిఘటన వచ్చింది. జాతీయ వైద్యమండలితో పాటు కర్నాటక ప్రభుత్వం ఏపీ కంటే ఎక్కువ ధర చెల్లించి కిట్లను కొనుగోలు చేసిన అంశాన్ని వైసీపీ ప్రస్తావించడంతో కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ […]

కన్నాపై కేంద్ర బీజేపీ ఆంక్షలు?
X

ఏపీ బీజేపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనిపై వైసీపీ నుంచి అంతే స్థాయిలో ప్రతిఘటన వచ్చింది.

జాతీయ వైద్యమండలితో పాటు కర్నాటక ప్రభుత్వం ఏపీ కంటే ఎక్కువ ధర చెల్లించి కిట్లను కొనుగోలు చేసిన అంశాన్ని వైసీపీ ప్రస్తావించడంతో కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఇరుకునపడ్డాయి.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన జేపీ నడ్డా … వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

”రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు. లోతైన అధ్యయనం చేయకుండా ఆరోపణలు చేయొద్దు. వివరాలు, ఆధారాలు సేకరించి కేంద్ర పార్టీకి అందజేయాలి. జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర పార్టీ అభిప్రాయం ఒకేలా ఉండాలి. వైసీపీ, టీడీపీతో సమదూరం పాటించాలి ” అని స్పష్టం చేశారు.

మిగిలిన సూచనలు ఎలా ఉన్నా… ఏదైనా ఆరోపణ చేయాలంటే ఆధారాలు కేంద్ర బీజేపీకి సమర్పించి అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే ఆరోపణలు చేయాలన్న జేపీ నడ్డా ఆదేశం కన్నా లక్ష్మీనారాయణకు చెక్‌ పెట్టడం కోసమేనని భావిస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర బీజేపీ పెద్దల వద్ద విశ్వసనీయతను కోల్పోయారని… అందుకే అనుమతి తీసుకున్న తర్వాత ప్రత్యర్థులపై ఆరోపణలు చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్టు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం …. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించడం గమనార్హం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కరోనాపై పోరాడుతున్నాయి…ఇప్పడు రాజకీయాలకు తావు లేదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, లోకేష్‌ పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారని , యనమల రామకృష్ణుడు దిగజారిపోయి విమర్శలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం విమర్శించారు.

First Published:  22 April 2020 11:37 PM GMT
Next Story