Telugu Global
Cinema & Entertainment

రాజమౌళికి అర్జున్ రెడ్డి డైరెక్టర్ చాలెంజ్

లాక్ డౌన్ తో సినీ సెలెబ్రెటీలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లంటూ దేశ విదేశాలు తిరిగే వారంతా ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా వీడియో చాలెంజ్ తో ముందుకొచ్చాడు. లాక్ డౌన్ తో పనిమనిషి రాకపోవడంతో ఇంట్లో పనిచేస్తూ అంట్లు తోముతూ ఇంటి పనులు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన సందీప్ రెడ్డి… స్టార్ డైరెక్టర్ రాజమౌళికి చాలెంజ్ చేశారు. సందీప్ […]

రాజమౌళికి అర్జున్ రెడ్డి డైరెక్టర్ చాలెంజ్
X

లాక్ డౌన్ తో సినీ సెలెబ్రెటీలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లంటూ దేశ విదేశాలు తిరిగే వారంతా ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా వీడియో చాలెంజ్ తో ముందుకొచ్చాడు.

లాక్ డౌన్ తో పనిమనిషి రాకపోవడంతో ఇంట్లో పనిచేస్తూ అంట్లు తోముతూ ఇంటి పనులు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన సందీప్ రెడ్డి… స్టార్ డైరెక్టర్ రాజమౌళికి చాలెంజ్ చేశారు.

సందీప్ ట్వీట్ చేస్తూ.. ‘మనిషి గొప్ప కార్మికుడిగా ఉండగలడు. నిజమైన మనిషి స్త్రీ చేసే అన్ని పనులు చేయగలడు. లాక్ డౌన్ సమయంలో మీ ఇంటిలో దయచేసి అందరూ సాయం చేయండి.. రాజమౌళి సార్ మీరు కూడా ఇలా చేసి ఆదర్శంగా నిలవండి.. ఇదే నా చాలెంజ్’ అంటూ పేర్కొన్నాడు.

సందీప్ రెడ్డి వంగ ట్వీట్ కు రాజమౌళి స్పందించాడు. వెంటనే అంగీకరించి వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తానని హామీ ఇచ్చాడు. ‘ఈ చాలెంజ్ ను అంగీకరిస్తున్నాను. ఇంట్లో పనిభారాన్ని పంచుకోవడం ముఖ్యం. రేపు నేను నా ఇంట్లో పనిచేసే వీడియోను షేర్ చేస్తాను’ అంటూ ట్వీట్ చేశారు.

First Published:  19 April 2020 7:27 AM GMT
Next Story