Telugu Global
Cinema & Entertainment

కాజల్ పెద్ద మనసు

మొన్నటివరకు హీరోయిన్లపై పెను దుమారం చెలరేగింది. కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ అవ్వగా, టాలీవుడ్ కూడా స్తంభించిపోయింది. ప్రముఖులంతా ముందుకొచ్చి అంతోఇంతో సాయం చేస్తున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో హీరోయిన్లపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు కాజల్ ముందుకొచ్చింది. తన పెద్ద మనసు చాటుకుంది. ఏదో విరాళం ఇచ్చామా చేతులు దులుపుకున్నామా అన్నట్టు కాకుండా అన్ని విధాలుగా తనకు తోచిన సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది. […]

కాజల్ పెద్ద మనసు
X

మొన్నటివరకు హీరోయిన్లపై పెను దుమారం చెలరేగింది. కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ అవ్వగా, టాలీవుడ్ కూడా స్తంభించిపోయింది. ప్రముఖులంతా ముందుకొచ్చి అంతోఇంతో సాయం చేస్తున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఒక్కరు కూడా ముందుకురాలేదు. దీంతో హీరోయిన్లపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు కాజల్ ముందుకొచ్చింది. తన పెద్ద మనసు చాటుకుంది. ఏదో విరాళం ఇచ్చామా చేతులు దులుపుకున్నామా అన్నట్టు కాకుండా అన్ని విధాలుగా తనకు తోచిన సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది.

టాలీవుడ్ సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ఇప్పటికే చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీకి 2 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది కాజల్. ఇప్పుడు దీనికితోడు దక్షిణ భారత సినీసమాఖ్య-ఫెఫ్సీకి మరో 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు.. ప్రధాన మంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో లక్ష రూపాయలు విరాళంగా అందించింది.

ఇక్కడితో ఆగలేదు కాజల్. తన ఇంటికి సమీపంలో ఉండే పేదలకు నిత్యం అన్నదానం చేస్తోంది. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఇలా పేదలకు అన్నదానం చేస్తానని చెబుతోంది ఈ చందమామ. నిజంగా కాజల్ ది చాలా పెద్ద మనసు.

First Published:  19 April 2020 2:07 AM GMT
Next Story