Telugu Global
NEWS

అప్పుడు దత్తాత్రేయ... ఇప్పుడు కన్నా... రికార్డు బద్దలు కొడతాడా?

ఇది 2004 నాటి మాట. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొత్తగా సీఎం అయ్యారు. ఆయన తనదైన స్టైల్‌లో పాలన సాగిస్తున్నారు. అప్పటివరకు తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉండేది. 2004లో ఓటమి తర్వాత రెండు పార్టీలు విడిపోయాయి. అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. ఆయన ప్రభుత్వంపై పోరాటం అంటూ అప్పటి ముఖ్యమంత్రికి వరుస పెట్టి లేఖలు రాసేవారు. మొదట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వరుసపెట్టి బహిరంగ లేఖలు రాసిన దత్తాత్రేయ.. ఆతర్వాత […]

అప్పుడు దత్తాత్రేయ... ఇప్పుడు కన్నా... రికార్డు బద్దలు కొడతాడా?
X

ఇది 2004 నాటి మాట. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొత్తగా సీఎం అయ్యారు. ఆయన తనదైన స్టైల్‌లో పాలన సాగిస్తున్నారు. అప్పటివరకు తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉండేది. 2004లో ఓటమి తర్వాత రెండు పార్టీలు విడిపోయాయి. అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. ఆయన ప్రభుత్వంపై పోరాటం అంటూ అప్పటి ముఖ్యమంత్రికి వరుస పెట్టి లేఖలు రాసేవారు.

మొదట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వరుసపెట్టి బహిరంగ లేఖలు రాసిన దత్తాత్రేయ.. ఆతర్వాత మరింత స్పీడ్ పెంచారు. వారానికి రెండు, మూడు రాసేదాకా వెళ్లారు. ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి వైఎస్‌కు ఆయన 144 లేఖలు రాశారు.

2009 ఎన్నికల తర్వాత కూడా ఈ లేఖాస్త్రాలను ఆపలేదు. ఎన్నికలముందు వరకు వైఎస్‌కు 144 లేఖలు రాసిన దత్తాత్రేయ భోలక్‌పూర్ ఘటనకు సంబంధించి145వ లేఖాస్త్రాన్ని సంధించారు. ఇలా 150 వరకు లేఖలు పూర్తి చేశారు.

అప్పట్లో సోషల్‌ మీడియా లేదు. అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా ఎదుగుతోంది. ఆ టైమ్‌లో పత్రికల అటెన్షన్‌ కోసం ఆయన ఆ పనిచేశారు. దత్తాత్రేయ లేఖల ద్వారా సాధించింది ఏంటి అంటే…. కమలం నేతలు కూడా అప్పుడు ఏం చెప్పలేకపోయారు.

ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ కూడా సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖలు రాస్తున్నారు. అప్పట్లో అంటే దత్తాత్రేయకు సోషల్ మీడియా లేకపోవడం వల్ల లేఖల రూటు పట్టారు. ఇప్పుడు వాడుకోవడానికి సోషల్ మీడియా ఉంది. కానీ కన్నా ఈ లేఖల రూటు ఎందుకు పట్టారనేది కమలనాథుల డౌట్‌.

కన్నా ట్వీట్లకు పెద్ద గా రియాక్షన్ రావడం లేదు. టీవీల్లో సౌండ్‌ బైట్లకు పెద్దగా లైకులు రావడం లేదు. దీంతో ఆయన ఇలా లేఖల బాటపట్టారు. తన పదవిని కాపాడుకోవడానికి ఒక పత్రికాధినేత డైరెక్షన్‌లో…. గుంటూరు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ నుంచి వచ్చే బహిరంగలేఖలను ఆయన విడుదల చేస్తున్నారట.

అయితే ఇక్కడ కన్నా అసలు విషయం వదిలిపెట్టారని జనాలు అంటున్నారు. బహిరంగ లేఖ రాయడం అనేది అవుడేటెడ్‌ వ్యవహారం. 15 ఏళ్ల కిందట దత్తాత్రేయ చేసిన పనినే ఇప్పుడు కన్నా చేయడం ఏంటి? తెలుగుదేశం నేతల దారిలోనే కన్నా కూడా అప్‌డేట్‌ కాలేదని కమలం నేతలే వాపోతున్నారు.

ఇప్పుడు బీజేపీలో మిగతా నేతలు ఎవరూ మాట మాట్లాడడం లేదు. ఒక కన్నా… అప్పుడప్పుడు సుజనా చౌదరి మాత్రం వైసీపీ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారు.

కన్నాబాటలోనే సీపీఐ నేత రామకృష్ణ కూడా సీఎంకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈయనకు కూడా స్క్రిప్ట్‌ అక్కడినుంచే వస్తుందని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఈ ఇద్దరు పంపే లేఖలు టీడీపీ రైటర్లు రాస్తున్నారని అంటున్నారు. విశేషం ఏంటంటే ఇద్దరి లేఖల్లో ఒకటే ఆరోపణలు ఉండడం వల్లే ఈ అనుమానాలు వస్తున్నాయి.

First Published:  17 April 2020 8:54 PM GMT
Next Story