Telugu Global
Cinema & Entertainment

కరోనాకు ఈ హీరోయిన్ అలా బుక్కయింది

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఇంట్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి తోచిన పని వాళ్లు చేసుకుంటున్నారు. అయితే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం కరోనాకు దొరికిపోయింది. ఆమె పేరు శ్రియ. అవును.. తన కరోనా కష్టాల్ని బయటపెట్టింది శ్రియ. తనకు, తన భర్తకు కరోనా సోకనప్పటికీ ఆ ప్రభావం మాత్రం తమపై గట్టిగా పడిందని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత శ్రియ స్పెయిన్ లో సెటిలైంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కరాళనృత్యం […]

కరోనాకు ఈ హీరోయిన్ అలా బుక్కయింది
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఇంట్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి తోచిన పని వాళ్లు చేసుకుంటున్నారు. అయితే ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం కరోనాకు దొరికిపోయింది. ఆమె పేరు శ్రియ. అవును.. తన కరోనా కష్టాల్ని బయటపెట్టింది శ్రియ. తనకు, తన భర్తకు కరోనా సోకనప్పటికీ ఆ ప్రభావం మాత్రం తమపై గట్టిగా పడిందని చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత శ్రియ స్పెయిన్ లో సెటిలైంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యథికంగా కరోనా బారిన దేశాల్లో స్పెయిన్ నాలుగో స్థానంలో ఉంది. అలాంటి దేశంలో ఉన్న శ్రియ, తన కరోనా బాధల్ని చెప్పుకొచ్చింది.

స్పెయిన్ లోని బార్సిలోనాలో శ్రియ, ఆమె భర్త అండ్రీ ఉంటున్నారు. ఒకసారి సెడన్ గా ఆండ్రీకి పొడిదగ్గు, జ్వరం వచ్చిందట. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు వెళ్తే, వాళ్లు చేర్చుకోవడానికి ఇష్టపడలేదట. ఇంట్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకోవాలని.. హాస్పిటల్ కు వస్తే వైరస్ సోకే ప్రమాదం మరింత ఉంటుందని చెప్పారట.

అలా ఇంటికొచ్చిన శ్రియ, ఆండ్రీ వేర్వేరు బెడ్ రూమ్స్ లో ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారట. కొన్నిరోజులకు ఆండ్రీకి దగ్గు-జ్వరం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నానని.. ఆ రోజులు తనను ఎంతగానో బాధించాయని చెప్పుకొచ్చింది శ్రియ. కరోనా వల్ల తమ పెళ్లి రోజును కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయామని అంటోంది.

First Published:  15 April 2020 1:00 AM GMT
Next Story