Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమాలకు ఇది పెద్ద దెబ్బే ?

బాహుబలి, సాహోతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని యూరప్ నేపథ్యంలో ఒక రోమాంటిక్ డ్రామా కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ అని ప్రచారం సాగుతున్న ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కానీ కరోనా వైరస్ టాలీవుడ్ తోపాటు ప్రపంచపు సినీ రంగాన్నే పూర్తిగా దెబ్బతీసేసింది. ఈ అనిశ్చితి ప్రభాస్ పై భారీగా పడింది. ‘రాధేశ్యామ్’ మూవీకి భారీ […]

prabhas hindi tamil language
X

బాహుబలి, సాహోతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని యూరప్ నేపథ్యంలో ఒక రోమాంటిక్ డ్రామా కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ అని ప్రచారం సాగుతున్న ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

కానీ కరోనా వైరస్ టాలీవుడ్ తోపాటు ప్రపంచపు సినీ రంగాన్నే పూర్తిగా దెబ్బతీసేసింది. ఈ అనిశ్చితి ప్రభాస్ పై భారీగా పడింది. ‘రాధేశ్యామ్’ మూవీకి భారీ దెబ్బగా పరిగణించింది.

ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధే శ్యామ్’ కోసం ఇప్పటికే 130 కోట్లు ఖర్చు చేశారని.. దాదాపు 20 రోజుల విదేశీ షెడ్యూల్ చిత్రీకరించాల్సి ఉందని ఆ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడానికి మరో 30-40కోట్లు బడ్జెట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రం లాభాలు పొందాలంటే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవల్లో విజయం సాధిస్తేనే పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుంది. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో డబ్బు వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు.

కరోనాతో జనాలు అప్పుడిప్పుడే థియేటర్స్ కు వచ్చే పరిస్థితులు లేవు. మరో 4-5 నెలలు థియేటర్స్ పై ఆంక్షలు ఉండొచ్చు. అంటే ప్రభాస్ సినిమా పూర్తి చేసినా విడుదల చేస్తే తీవ్ర నష్టాలు తప్పవు. బ్రేక్ ఈవెన్ సాధించడానికి చాలా సమయం పడుతుంది. ఆలస్యం చేస్తే పెట్టుబడి తడిసి మోపెడవుతుంది. విడుదల చేస్తే కలెక్షన్లు రావు. సో ప్రభాస్ తన తదుపరి భారీ బడ్జెట్ చిత్రంపై ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  15 April 2020 8:00 AM GMT
Next Story