Telugu Global
Cinema & Entertainment

శ్రియ నుంచి కాపాడమంటున్న ఆమె భర్త

శ్రియ, ఆండ్రీది లవ్ మ్యారేజ్. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీడియాకు కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది శ్రియ. ఈమెది ఇండియా. ఆండ్రీది రష్యా. కానీ ఇద్దరూ కలిసి స్పెయిన్ లో కాపురం పెట్టారు. ప్రస్తుతం స్పెయిన్ మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది. ఈ సందర్భంగా తన భార్య నుంచి తనను కాపాడాలంటూ ఓ వీడియో పెట్టాడు ఆండ్రీ. లాక్ డౌన్ టైమ్ లో భార్యాభర్తల కాన్సెప్ట్ తో చాలా జోకులు వస్తున్నాయి. ఈ […]

శ్రియ నుంచి కాపాడమంటున్న ఆమె భర్త
X

శ్రియ, ఆండ్రీది లవ్ మ్యారేజ్. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీడియాకు కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది శ్రియ. ఈమెది ఇండియా. ఆండ్రీది రష్యా. కానీ ఇద్దరూ కలిసి స్పెయిన్ లో కాపురం పెట్టారు. ప్రస్తుతం స్పెయిన్ మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది. ఈ సందర్భంగా తన భార్య నుంచి తనను కాపాడాలంటూ ఓ వీడియో పెట్టాడు ఆండ్రీ.

లాక్ డౌన్ టైమ్ లో భార్యాభర్తల కాన్సెప్ట్ తో చాలా జోకులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆండ్రీ కూడా సరదాగా ఈ వీడియో పెట్టాడు. సామాజిక దూరం పాటించమంటూ ప్లకార్డ్ చూపిస్తుంది శ్రియ. ఆమె వెనకే ఈమె చెత్తంతా మాట్లాడుతోందంటూ ఆండ్రీ ప్లకార్డ్ పట్టుకున్నాడు. ఆ వెంటనే నాన్ స్టాప్ గా పనిచేస్తున్న వ్యక్తులందరికీ థ్యాంక్స్ చెబుతుంది శ్రియ. స్టే ఎట్ హోమ్ అంటూ మరో కార్డ్ చూపిస్తుంది. ఆ వెనక ఆండ్రీ.. మా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మరో కార్డ్ చూపిస్తాడు.

ఇలా వీళ్లిద్దరి క్వారంటైన్ టైమ్ ఫన్నీగా సాగిపోతోంది. 3 రోజుల కిందట అండ్రీతో వంట గిన్నెలన్నీ తోమించింది శ్రియ. ఆ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

View this post on Instagram

True love #stayathome @andreikoscheev

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

First Published:  11 April 2020 5:32 AM GMT
Next Story