Telugu Global
Cinema & Entertainment

అతడికి చెర్రీ ఛాన్స్ ఇస్తాడా?

తెలుగు సినీచరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా డిజాస్టర్ అయింది. ఈ దెబ్బకు దర్శకుడు సుజీత్ కొన్ని నెలల పాటు ఎవ్వరికీ కనిపించలేదు. టాలీవుడ్ లో అతడి ఉనికి కూడా కనిపించలేదు. ఎట్టకేలకు సుశాంత్ సినిమా ఓపెనింగ్ తో బయటకొచ్చాడు ఈ దర్శకుడు. అలా మళ్లీ ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలో కలుస్తున్న సుజీత్.. ఇప్పుడు మరో కథతో రెడీ అవుతున్నాడు. ఏకంగా రామ్ చరణ్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడు సుజీత్. యూవీ క్రియేషన్స్ […]

అతడికి చెర్రీ ఛాన్స్ ఇస్తాడా?
X

తెలుగు సినీచరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా డిజాస్టర్ అయింది. ఈ దెబ్బకు దర్శకుడు సుజీత్ కొన్ని నెలల పాటు ఎవ్వరికీ కనిపించలేదు. టాలీవుడ్ లో అతడి ఉనికి కూడా కనిపించలేదు. ఎట్టకేలకు సుశాంత్ సినిమా ఓపెనింగ్ తో బయటకొచ్చాడు ఈ దర్శకుడు. అలా మళ్లీ ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలో కలుస్తున్న సుజీత్.. ఇప్పుడు మరో కథతో రెడీ అవుతున్నాడు.

ఏకంగా రామ్ చరణ్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడు సుజీత్. యూవీ క్రియేషన్స్ నిర్మాతల సిఫార్స్ తో చరణ్ ను కలిసిన సుజీత్.. అతడికి మంచి ట్విస్టులున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను వినిపించాడు. చరణ్ తో సినిమా చేయాలని యూవీ నిర్మాతలు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సో.. సుజీత్ కథతో ఎలాగైనా చరణ్ ను ఒప్పించి సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారు. అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి రెడీ.

కానీ చరణ్ ప్లాన్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ఏదో బ్యానర్ కు అవకాశం ఇచ్చే కంటే, తన సొంత బ్యానర్ లోనే సినిమా నిర్మిస్తూ నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు. మరో ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడు. హారిక-హాసిని నిర్మాతలతో సినిమా చేస్తూనే.. తన అన్న కల్యాణ్ రామ్ ను సహ-నిర్మాతగా పెట్టాడు.

సో.. సాహోతో ఫ్లాప్ కొట్టిన సుజీత్ లాంటి దర్శకుడికి చరణ్ అవకాశం ఇస్తాడా.. ఇస్తే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  9 April 2020 9:01 PM GMT
Next Story