Telugu Global
NEWS

ప్రపంచకప్ ఫైనల్స్ వైపు భారత్ చూపు

సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ తో పోటీ ఆస్ట్ర్రేలియా వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ పోరుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే తొలిసెమీస్ లో హాట్ ఫేవరెట్ భారత్ తో మాజీ చాంపియన్ ఇంగ్లండ్, రెండో సెమీఫైనల్లో ఆతిథ్య ఆస్ట్ర్రేలియాతో సంచలనాల సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత్ ఆల్ విన్ రికార్డు… గ్రూప్-ఏ లీగ్ లో ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా టాపర్ గా […]

ప్రపంచకప్ ఫైనల్స్ వైపు భారత్ చూపు
X
  • సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ తో పోటీ

ఆస్ట్ర్రేలియా వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ పోరుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా రంగం సిద్ధమయ్యింది.

మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే తొలిసెమీస్ లో హాట్ ఫేవరెట్ భారత్ తో మాజీ చాంపియన్ ఇంగ్లండ్, రెండో సెమీఫైనల్లో ఆతిథ్య ఆస్ట్ర్రేలియాతో సంచలనాల సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్ ఆల్ విన్ రికార్డు…

గ్రూప్-ఏ లీగ్ లో ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా టాపర్ గా నిలిచిన భారతజట్టు…తొలిసెమీఫైనల్లో ప్రపంచ రెండోర్యాంకర్ ఇంగ్లండ్ తో సమరానికి సిద్ధమయ్యింది. 2018 ప్రపంచకప్ లో సైతం భారతజట్టు సెమీస్ లో ఇంగ్లండ్ తోనే తలపడాల్సివచ్చింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ సమరంలో భారతజట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ పై నెగ్గిన ఆత్మవిశ్వాసంతో భారత్ పోటీకి దిగనుంది.

కంగారూలతో సఫారీల సమరం…

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-బీ లీగ్ టాపర్ సౌతాఫ్రికాతో …గ్రూప్- ఏ రన్నరప్ ఆస్ట్ర్రేలియా ఢీ కోనుంది. ప్రపంచకప్ చరిత్రలో …అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన ఆస్ట్ర్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్ గా సెమీస్ బరిలోకి దిగుతోంది.

మరోవైపు…గ్రూప్ లీగ్ లో భారీస్కోర్లతో సంచలన విజయాలు సాధిస్తూ వచ్చిన సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే… కంగారూలను కంగుతినిపించినా ఆశ్చర్యం లేదు.

మార్చి 8న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా…ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మహిళా ప్రపంచకప్ టైటిల్ సమరాన్ని నిర్వహించనున్నారు.

First Published:  3 March 2020 7:37 PM GMT
Next Story