Telugu Global
NEWS

సీమ కరువు తీర్చే జగన్ ప్లాన్ సక్సెస్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించి కేసీఆర్ భగీరథుడిగా మారారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అపర భగీరథుడి పేరు సార్థకం చేసుకునేందుకు సంకల్పించారు. జగన్ పట్టుదల, కృషికి ప్రపంచబ్యాంకు తలొగ్గింది. ఏకంగా తన రూల్స్ మార్చుకొని మరీ జగన్ సంకల్పానికి నిధులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సీమ కరువు తీర్చేందుకు వడివడిగా ముందుకెళ్తున్న జగన్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. రాయలసీమే కాదు.. కరువుతో అల్లాడే ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏపీ సీఎం […]

సీమ కరువు తీర్చే జగన్ ప్లాన్ సక్సెస్
X

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించి కేసీఆర్ భగీరథుడిగా మారారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అపర భగీరథుడి పేరు సార్థకం చేసుకునేందుకు సంకల్పించారు.

జగన్ పట్టుదల, కృషికి ప్రపంచబ్యాంకు తలొగ్గింది. ఏకంగా తన రూల్స్ మార్చుకొని మరీ జగన్ సంకల్పానికి నిధులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సీమ కరువు తీర్చేందుకు వడివడిగా ముందుకెళ్తున్న జగన్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

రాయలసీమే కాదు.. కరువుతో అల్లాడే ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుకుని ఏపీ సీఎం జగన్ ఓ మహాత్కార్యానికి పూనుకున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి ప్రపంచబ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించడం జగన్ సర్కారు సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.

సాధారణంగా ప్రపంచబ్యాంక్ సాగునీటి ప్రాజెక్టులకు రుణాలివ్వదు. కేవలం పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. ఆధునీకరణ, నీటి యాజమాన్య పద్ధతుల వంటి పనులకు మాత్రమే రుణాలిస్తుంటుంది. కానీ జగన్ సర్కారు ప్రపంచ బ్యాంక్ అధికారులతో చర్చించి వారిని కన్విన్స్ చేసింది. దీంతో తన నిబంధనలను మార్చుకొని మరీ దాదాపు 33,869 కోట్ల నిధులను మంజూరు చేయడానికి ఒప్పుకుంది. ఈ మేరకు జగన్ సర్కారు పీపీఆర్ రూపొందిస్తోంది.

రాయలసీమ ప్రాజెక్టులను కట్టడం.. కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచి సీమకు గోదావరి, కృష్ణా జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ఈ పీపీఆర్ కు ప్రపంచబ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తక్కువ వడ్డీకే నిధులు అంది రాయలసీమ కరువు తీరుతుంది. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది.

First Published:  22 Feb 2020 1:36 AM GMT
Next Story