Telugu Global
NEWS

‘బాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతనా? లేదంటే 29 గ్రామాలకేనా?’

మంచి అవకాశం మించిన దొరకదు అంటారు పెద్దలు. ఈ మాటను అక్షర సత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. అమరావతి విషయంలో.. ఎంత రాద్ధాంతం చేయాలో.. అంతగా చేసేస్తూ.. అసలు రాష్ట్రంలో మరో సమస్యే లేదన్నట్టుగా కొంత కాలంగా ప్రవర్తిస్తున్నారు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఇదే విషయాన్ని పట్టుకున్న రోజా.. చంద్రబాబు అండ్ కో ను ఓ ఆటాడేసుకున్నారు. కాస్త ఆలోచించే ప్రశ్నలు వేస్తూ.. సమాధానాల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆమె […]

‘బాబు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతనా? లేదంటే 29 గ్రామాలకేనా?’
X

మంచి అవకాశం మించిన దొరకదు అంటారు పెద్దలు. ఈ మాటను అక్షర సత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. అమరావతి విషయంలో.. ఎంత రాద్ధాంతం చేయాలో.. అంతగా చేసేస్తూ.. అసలు రాష్ట్రంలో మరో సమస్యే లేదన్నట్టుగా కొంత కాలంగా ప్రవర్తిస్తున్నారు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఇదే విషయాన్ని పట్టుకున్న రోజా.. చంద్రబాబు అండ్ కో ను ఓ ఆటాడేసుకున్నారు. కాస్త ఆలోచించే ప్రశ్నలు వేస్తూ.. సమాధానాల కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఆమె ప్రశ్నలు ఏంటంటే..

  • హైదరాబాద్ మనకు పదేళ్లు రాజధానిగా ఉన్నప్పుడు హఠాత్తుగా వదిలి ఎందుకు వచ్చారు?
  • అమరావతిలో ఎందుకు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కట్టలేకపోయారు?
  • అసెంబ్లీలో సభ్యులకు అవసరమైనన్ని బాత్ రూములూ ఎందుకు అందుబాటులోకి తేలేకపోయారు?
  • రాష్ట్రంలో మహిళలు గతంలో ఎన్నో బాధలు పడ్డారు. అప్పుడు రాని మహిళలు ఇప్పుడెలా బయటికి వచ్చారు?
  • ప్రజా సమస్యలపై ఏనాడైనా చంద్రబాబు జోలె పట్టారా?

వీటన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న రోజా.. మధ్యలో ఓ ఆసక్తికర కామెంట్ ను వదిలారు. 40 ఏళ్ల కుర్రాడు 40 ఏళ్ల శాసనసభ్యుడిగా అనుభవం ఉన్న వ్యక్తిని జోలె పట్టుకునేలా చేశాడు.. అంటూ బుల్లెట్ లాంటి వ్యాఖ్య చేశారు.

చూస్తుంటే.. గతంలో తనను ఇబ్బంది పెట్టిన టీడీపీపై రోజా మనసులో బాగానే కోపం పెంచుకున్నట్టున్నారు. ఇలా అవకాశం రాగానే.. అలా కోపాన్నంతా వెళ్లగక్కుతున్నారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.

ఇలా సర్ది చెప్పుకోవడం కాదు కానీ.. రోజా వేసిన ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో ఏమని సమాధానం చెబుతున్నారని వైసీపీ ఫాలోవర్లు అడుగుతున్నారు.

First Published:  20 Jan 2020 5:00 AM GMT
Next Story