Telugu Global
Cinema & Entertainment

'అలా' సినిమా షూటింగ్ పూర్తయింది

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తన షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ స్టిల్ మరోసారి వైరల్ అయింది. సినిమాకు సంబంధించి తాజాగా బుట్టబొమ్మ అనే సాంగ్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన ఫొటోనే తాజాగా విడుదల చేశారు. బన్నీ, పూజా హెగ్డే కలిసి డాన్స్ […]

అలా సినిమా షూటింగ్ పూర్తయింది
X

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తన షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ స్టిల్ మరోసారి వైరల్ అయింది.

సినిమాకు సంబంధించి తాజాగా బుట్టబొమ్మ అనే సాంగ్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన ఫొటోనే తాజాగా విడుదల చేశారు. బన్నీ, పూజా హెగ్డే కలిసి డాన్స్ చేస్తున్న స్టిల్ ఇది. ఈ స్టిల్ కూడా ఎంతో రీఫ్రెషింగ్ గా ఉంది. ఇప్పటికే టీజర్ తో పాటు సాంగ్స్ అన్నీ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. దానికితోడు ఏ చిన్న స్టిల్ రిలీజైనా అది క్లిక్ అవుతోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్, గీతాఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేస్తుండడంతో మూవీ ఫస్ట్ కాపీ అతిత్వరగా రెడీ అయ్యే అవకాశం ఉంది. సో.. రిలీజ్ విషయంలో ఈ సినిమా మహేష్ మూవీ కంటే కాస్త ముందే ఉందని చెప్పాలి.

First Published:  28 Dec 2019 9:04 PM GMT
Next Story