Telugu Global
Cinema & Entertainment

చివరకు ఫొటో దిగేందుకు కూడా డబ్బులు వసూలు చేశారా?

సూపర్ స్టార్ మహేష్ తో ఫొటోషూట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.. నిర్మాతలు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ను ఆహ్వానించి వారు వచ్చాక ఎగబడడంతో చేసేదేం లేక దీన్ని వాయిదా వేశారు. ఈ తోపులాట గొడవల్లో పలువురు మహేష్ అభిమానుల కాళ్లు విరిగి గాయపడ్డారు. ఇక మహేష్ ఫొటో సెషన్ వివాదంపై తాజాగా మహేష్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. బౌన్సర్లు తమతో దారుణంగా ప్రవర్తించారని విమర్శిస్తున్నారు. మహేష్ […]

చివరకు ఫొటో దిగేందుకు కూడా డబ్బులు వసూలు చేశారా?
X

సూపర్ స్టార్ మహేష్ తో ఫొటోషూట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.. నిర్మాతలు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ను ఆహ్వానించి వారు వచ్చాక ఎగబడడంతో చేసేదేం లేక దీన్ని వాయిదా వేశారు. ఈ తోపులాట గొడవల్లో పలువురు మహేష్ అభిమానుల కాళ్లు విరిగి గాయపడ్డారు.

ఇక మహేష్ ఫొటో సెషన్ వివాదంపై తాజాగా మహేష్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని.. బౌన్సర్లు తమతో దారుణంగా ప్రవర్తించారని విమర్శిస్తున్నారు. మహేష్ కోసం రాష్ట్రవ్యాప్తంగా తరిలివచ్చిన తమను కొట్టి తోసేశారని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇక కొందరేమో మహేష్ బాబు తో ఫొటో దిగేందుకు డబ్బులు పెట్టి పాస్ కొనుక్కొని వచ్చామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ తో ఫొటో దిగేందుకు రూ.500 నుంచి రూ.2000 వరకూ పాస్ లు ఇచ్చారని.. వాటిని ఎగబడి కొన్నామని..తీరా అక్కడికి వచ్చాక తమను మహేష్ దగ్గరకు రానీయకుండా… కుక్కలను కొట్టినట్టు కొట్టారని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలతో మహేష్ తో ఫొటో కోసం డబ్బులు తీసుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

First Published:  26 Dec 2019 3:54 AM GMT
Next Story